Site icon NTV Telugu

100% Muslim Country: ఒకప్పుడు ఇది హిందూ రాజ్యం.. ఇప్పుడు 100% ముస్లిం జనాభా నివసిస్తున్న ఏకైక దేశం..!

Maldives

Maldives

100% Muslim Country: ప్రపంచంలో అనేక మతాలు ఉన్నాయి. దాదాపు అన్ని దేశాల్లో విభిన్న మతాలకు చెందిన వాళ్లు నివసిస్తుంటారు. ప్రతి దేశంలో మెజార్టీ మతాలు ఉంటాయి. మనం ఇప్పుడు ఓ ఆసక్తికర విషయం గురించి తెలుసుకుందాం. 100% ముస్లిం జనాభా ఉన్న దేశంలో గురించి చర్చిద్దాం. వాస్తవానికి.. ఒకప్పుడు ఈ దేశాన్ని హిందు రాజులు పాలించారు. కానీ.. కాల క్రమేణా ఇది ముస్లిం దేశంగా మారిపోయింది. ఆ దేశం పేరేంటి? అని ఆలోచిస్తున్నారా? అదేనండి.. మన పొరుగున ఉన్న మల్దీవులు. మల్దీవులు దాదాపు 1200 దీవుల సమూహం. ఇది హిందూ మహాసముద్రంలో ఉన్న ఒక ద్వీప దేశం. భారతదేశానికి చాలా దగ్గరగా ఉంది. మాల్దీవులలోని 200 దీవులలో మాత్రమే జనాభా నివసిస్తుంది. అయితే 12 దీవులు పర్యాటకుల కోసం కేటాయించారు. ఇక్కడ రిసార్ట్‌లు, హోటళ్ళు, పర్యాటకులు సందర్శించడానికి సౌకర్యాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం దాదాపు ఆరు లక్షల మంది పర్యాటకులు ఇక్కడికి వస్తారు. ఎక్కువ మంది పర్యాటకులు భారతదేశం నుంచే వస్తారు. దాని ఆర్థిక వ్యవస్థలో భారత్ ప్రత్యేక పాత్ర పోషిస్తుంది.

READ MORE: Free Robotics Courses: రోబోటిక్స్‌పై బెస్ట్ ఫ్రీ కోర్సులు ఇవే.. విద్యార్థులకు గోల్డెన్ ఫ్యూచర్ పక్కా!

ఈ దేశం ప్రస్తుతం 100% ముస్లిం దేశంగా మారింది. కానీ, పన్నెండవ శతాబ్దం కిందట మాల్దీవులు హిందూ రాజుల పాలనలో ఉండేవి. తరువాత ఇది బౌద్ధమత కేంద్రంగా కూడా మారింది. తమిళ చోళ రాజులు సైతం పాలించారు. కానీ ఆ తర్వాత ఇది నెమ్మదిగా ముస్లిం దేశంగా మారడం ప్రారంభించింది. ఇస్లాం మాల్దీవుల అధికారిక మతం. “ముస్లిం కాని వ్యక్తి మాల్దీవుల పౌరుడు కాలేడు”. అంటే నూటికి నూరు శాతం ఆదేశంలో ముస్లింలు మాత్రమే ఉంటారు. చారిత్రక ఆధారాలు, ఇతిహాసాల ప్రకారం, మాల్దీవుల చరిత్ర 2,500 సంవత్సరాల నాటిది. మాల్దీవులలో మొట్టమొదటి గుజరాతీలు నివసించేరని చెబుతారు. భారత్‌ నుంచి గుజరాతీలు క్రీ.పూ. 500 ప్రాంతంలో శ్రీలంకకు వచ్చి స్థిరపడ్డారు. అక్కడి నుంచి కొందరు మాల్దీవులకు వలస వచ్చారు. మాల్దీవుల మొదటి నివాసులు ధేవిలు అని పిలువబడే వర్గానికి చెందిన వాళ్లట. వారు భారతదేశంలోని కాలిబంగన్ నుంచి అక్కడికి చేరుకున్నారు. సౌర రాజవంశం మాల్దీవులను పాలించిన రాజులుగా చెబుతున్నారు.

READ MORE: Delhi BMW crash: బీఎండబ్ల్యూ కారు ప్రమాదంలో కీలక ట్విస్ట్.. నిందితురాలు షాకింగ్ స్టేట్‌మెంట్

Exit mobile version