NTV Telugu Site icon

India- Maldives Row: మాల్దీవులకు తగ్గిన పర్యాటకుల సంఖ్య.. ఇబ్బందుల్లో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ

Maldives

Maldives

Lakshadweep: భారత ప్రధాని నరేంద్ర మోడీపై మాల్దీవుల మంత్రుల అభ్యంతరకర వ్యాఖ్యలతో ఇరు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ కామెంట్స్ పై భారత్ నిరసన వ్యక్తం చేయగా.. ఇతర దేశాలు కూడా భారత్‌కు మద్దతు తెలిపాయి. ఇదిలా ఉంటే, భారత ప్రజలతో పాటు పలువురు ప్రముఖులు కూడా మాల్దీవులపై తమ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాల్దీవులను సందర్శించే బదులు లక్షద్వీప్‌కు వెళ్లాలని ప్రజలు చర్చించుకుంటున్నారు. దీంతో పాటు మాల్దీవులను బహిష్కరించడం కూడా ట్రెండింగ్ అవుతుంది. అనేక విదేశీ టూర్ బుకింగ్ ఏజెన్సీలు కూడా మాల్దీవుల ప్యాకేజీలను మూసివేస్తున్నట్లు ప్రకటించాయి.

Read Also: Nifty At Alltime High : ఉత్సాహంగా ఐటీ షేర్లు.. ఆల్ టైం హైని టచ్ చేసిన నిఫ్టీ

ఇక, భారత్‌తో వివాదం ముదిరిన తర్వాత మాల్దీవులకు వచ్చే పర్యాటకుల సంఖ్య భారీగా తగ్గింది. భారత్ లోనే వందలాది మంది తమ పర్యటనలను క్యాన్సిల్ చేసుకున్నారు. దీంతో పాటు మేక్ మై ట్రిప్, ఈజ్ మై ట్రిప్ మాల్దీవుల బుకింగ్‌లను రద్దు చేశాయి. అయితే, మాల్దీవులకు భారతదేశం రెండవ అతిపెద్ద పర్యాటక మార్కెట్.. భారతీయ పర్యాటకులు పెద్ద సంఖ్యలో మాల్దీవులను సందర్శిస్తారు. ఇటీవలి కాలంలో మాల్దీవులకు పర్యాటకుల రాకపోకలకు భారతదేశం స్థిరమైన సహకారాన్ని అందిస్తోంది. ఇది అత్యంత ఇష్టమైన హాలిడే గమ్యస్థానాలలో ఒకటిగా నిలిచింది.

Read Also: YV Subba Reddy: 175 నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యం.. అందుకే మార్పులు..

కానీ, మాల్దీవుల పర్యాటక మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. అధికారిక డేటా ప్రకారం 2023 మొదటి 11 నెలల్లో మాల్దీవులకు వచ్చే పర్యాటకులలో భారతదేశం రెండవ అతిపెద్ద వనరుగా నిలిచింది. ఈ కాలంలో 1, 83,371 మంది పర్యాటకులు మాల్దీవులను సందర్శించారు. భారతదేశం నుంచి పర్యాటకులు మాల్దీవులకు వెళ్లకపోవడం ఆ దేశానికి పెద్ద నష్టం వాటిల్లింది. ఇటీవల, పెద్ద సంఖ్యలో భారతీయులు మాల్దీవులను బహిష్కరించి.. లక్షద్వీప్‌కు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు.