NTV Telugu Site icon

T20 World Cup: ఖాతా తెరవని ఆరుగురు బ్యాటర్లు.. 13 బంతుల్లోనే విజయం! టీ20ల్లో అత్యంత చెత్త టీమ్ ఇదే

Malaysia Vs Mongolia

Malaysia Vs Mongolia

Mongolia All Out for 31 Runs vs Malaysia: మంగోలియన్‌ క్రికెట్ జట్టు మరోసారి పేలవ ప్రదర్శన చేసింది. కొద్ది రోజుల క్రితం కేవలం 17 పరుగులకే అలౌటైన మంగోలియన్‌ టీమ్.. తాజాగా 31 పరుగులకు కుప్పకూలింది. మలేషియాలోని యూకేఎం ఓవల్‌ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌ క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో ఈ చెత్త ప్రదర్శన నమోదు చేసింది. మంగోలియన్‌ జట్టులో ఏకంగా ఆరుగురు బ్యాటర్లు ఖాతానే తెరవలేదు. ప్రత్యర్థి మలేషియా కేవలం 13 బంతుల్లోనే టార్గెట్ ఫినిష్ చేసి భారీ విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన మంగోలియా 16.1 ఓవర్లలో 31 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్ మోహన్ వివేకానందన్ (8) టాప్ స్కోరర్. 26 బంతుల్లో 8 పరుగులు చేశాడు. మంగోలియా జట్టులోని ఆరుగురు బ్యాటర్లు ఖాతానే తెరవలేదు. ఈ మ్యాచ్‌లో మంగోలియన్ టీమ్ ఒకే ఒక్క బౌండరీని నమోదుచేసింది. ఎంఖ్‌బాత్ బత్‌ఖుగ్ ఒక బౌండరీ బాదాడు. మలేషియా బౌలర్ విరణ్ దీప్ సింగ్ 4 ఓవర్లలో 5 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. రిజ్వాన్ హైదర్, పవన్‌దీప్ సింగ్, విజయ్ ఉన్ని, మహ్మద్ అమీర్, సయ్యద్ అజీజ్ తలో వికెట్ పడగొట్టారు.

Also Read: IND vs BAN: సర్ఫరాజ్‌ ఖాన్‌‌కు.. స్టార్‌ బ్యాటర్‌కు ఛాన్స్‌?

31 పరుగుల లక్ష్యాన్ని మలేషియా 2.1 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా పూర్తిచేసింది. మలేషియా కెప్టెన్ కమ్ ఓపెనర్ సయ్యద్ అజీజ్ 11 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 31 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మరో ఓపెనర్ జుబైద్ జుల్కిఫ్లే 3 బంతుల్లో 3 పరుగులు చేశాడు. మంగోలియా జట్టు గతంలో కువైట్, హాంకాంగ్, మయన్మార్, సింగపూర్, మాల్దీవుల చేతిలో కూడా ఘోర పరాజయాలను ఎదుర్కొంది. ఈ ఓటమితో మంగోలియా టీ20 ప్రపంచకప్‌ అర్హత ఆశలు గల్లంతయ్యాయి. క్వాలిఫయర్స్‌లో ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో ఓడి పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది.