Tovino Thomas : టాలీవుడ్ మూవీస్ మేకింగ్ పై మలయాళ స్టార్ హీరో టోవినో థామస్ సెటైర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దక్షిణాది చిత్ర పరిశ్రమలో మలయాళం మరియు తెలుగు సినిమాల మేకింగ్ విధానాలు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. మలయాళంలో కథకు సహజత్వానికి పెద్దపీట వేస్తే.. తెలుగులో భారీతనం కమర్షియల్ హంగులకు ప్రాధాన్యత ఉంటుంది. తాజాగా ఒక మలయాళ స్టార్ నటుడు టోవినో థామస్ టాలీవుడ్ వర్క్ కల్చర్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. తాను ఎందుకు స్ట్రయిట్ తెలుగు సినిమాలు చేయలేకపోతున్నానో ఆయన స్పష్టంగా వివరించారు.
Also Read : Jana Nayagan : రిలీజ్ కు రెడీ అవుతున్న ‘జననాయగన్’
Also Read
- WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
- Pensions: పెన్షన్ల నిధులు విడుదల.. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ షురూ..
- New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
ఇటీవల జరిగిన ఓ ప్రెస్ మీట్ టోవినో మాట్లాడుతూ ‘ సాధారణంగా మలయాళంలో సినిమాలను చాలా వేగంగా పూర్తి చేస్తారు. “మేం మలయాళంలో ఒక సినిమాను సింగిల్ షెడ్యూల్‌లో పూర్తి చేయడానికి అలవాటు పడ్డాం. కానీ తెలుగులో పరిస్థితి వేరు. ఇక్కడ ఒక ప్రాజెక్టు పట్టాలెక్కి పూర్తవ్వడానికి కనీసం ఏడాది సమయం పడుతోంది. ఒకేసారి రెండు మూడు సినిమాలు చేయడం నా వల్ల కాదు. ఒక సినిమా కోసం నేను 3 నెలల సమయం మాత్రమే కేటాయించగలను. అంతకుమించి ఒకే ప్రాజెక్టుపై ఉండటం నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది. తెలుగులో ఒక సినిమా ఒప్పుకుంటే అదే సమయంలో మలయాళంలో మూడు మంచి సినిమాలను వదులుకోవాల్సి వస్తుంది. తెలుగు సినిమా మేకింగ్ డిఫరెంట్, మలయాళ సినిమా మేకింగ్ డిఫరెంట్ . తెలుగులో భారీ యాక్షన్ సీక్వెన్సులు, సాంగ్స్ కోసం ఎక్కువ రోజులు కేటాయించాల్సి వస్తుందని, కానీ కేరళలో షార్ట్ షెడ్యూల్స్ తో సినిమాలు ముగించడం వల్ల ఎక్కువ సినిమాలు చేసే అవకాశం ఉంటుంది’ అని అన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు టాలీవుడ్ మేకింగ్ వేగంపై మరియు మలయాళ నటుల వర్క్ ప్రయారిటీస్ పై కొత్త చర్చకు తెరలేపాయి.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!