Site icon NTV Telugu

Abraham Ozler : ఓటిటిలోకి వచ్చేసిన మలయాళ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Whatsapp Image 2024 03 20 At 2.21.30 Pm

Whatsapp Image 2024 03 20 At 2.21.30 Pm

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి అతిథి పాత్రలో నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ అబ్రహం ఓజ్లర్. ఈ మూవీలో జయరాం ప్రధాన పాత్రలో నటించారు.గతేడాది డిసెంబర్ లో రిలీజై సంచలన విజయం సాధించిన ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం చాలా రోజులుగా అభిమానులు ఎదురు చూస్తున్నారు.మమ్ముట్టి సీరియల్ కిల్లర్ గా నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ బుధవారం (మార్చి 20) నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.40 కోట్లకుపైగా వసూలు చేసిందీ మూవీ. ఈ మూవీకి మొదట మిశ్రమ స్పందన వచ్చినా కూడా బాక్సాఫీస్ దగ్గర మాత్రం సక్సెస్ అయింది.ఈ అబ్రహం ఓజ్లర్ మూవీ మలయాళంతోపాటు తెలుగు, హిందీ, తమిళం మరియు కన్నడ భాషల్లో అందుబాటులోకి వచ్చింది.జయరాం కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ఈ మూవీ నిలిచింది.

ఈ సినిమాలో అబ్రహం ఓజ్లర్ అనే పాత్రలో జయరాం నటించాడు. ఇక మమ్ముట్టి.. అలెక్స్ అనే సీరియల్ కిల్లర్ పాత్ర పోషించాడు.ఈ మూవీ కథ విషయానికి వస్తే అబ్రహం ఓజ్లర్ భార్యాపిల్లలు మిస్సవుతారు. వారు కనిపించకుండా పోయినట్లుగా ఓజ్లర్ ఊహించుకుంటుంటాడు. మరోవైపు వరుసగా కొందరు భిన్న నేపథ్యాలు కలిగిన వ్యక్తులు హత్యలకు గురువుతుంటారు.వాళ్ల దగ్గర హ్యాపీ బర్త్ డే అంటూ రక్తంతో రాసి ఉన్న పేపర్స్ దొరుకుతుంటాయి. ఆ హత్యల వెనకున్న ట్విస్ట్‌ను ఓజ్లర్ ఎలా ఛేదించాడు..? అలెక్స్ సీరియల్ కిల్లర్‌గా మారడానికి కారణం ఏమిటి..? సుజా అనే అమ్మాయిని ప్రేమించిన అలెక్స్ ఆమె మరణానికి కారణమైన వారిపై ఎలా రివేంజ్ తీర్చుకున్నాడు అన్నదే ఈ మూవీ కథ. అబ్రహం ఓజ్లర్ మూవీకి మిదున్ థామస్ దర్శకత్వం వహించాడు.

Exit mobile version