NTV Telugu Site icon

Actor Vijayakumar: ఆత్మహత్యాయత్నం కేసులో నిర్ధోషిగా మలయాళ నటుడు విజయకుమార్

Actor Vijayakumar

Actor Vijayakumar

Malayalam Actor Vijayakumar: మలయాళ నటుడు విజయకుమార్‌ను పోలీసు అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయంలో విచారించగా.. ఆత్మహత్యాయత్నం చేసిన కేసులో కొచ్చి మేజిస్ట్రేట్ కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. 13 ఏళ్ల నాటి ఈ కేసులో తగిన సాక్ష్యాధారాలు లేవని కోర్టు అతడిని నిర్దోషిగా ప్రకటించింది. ఈ కేసు ఫిబ్రవరి 11, 2009 నాటిది. రూ. 25 లక్షలు దోపిడీ చేసిన కేసులో విచారణ కోసం త్రిక్కాకర అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయానికి పిలవగా.. మనస్తాపానికి గురైన నటుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

Anand Mahindra: నాటు నాటు అంత ఎనర్జీలేదు.. ఆనంద్‌ మహీంద్ర ట్వీట్‌ వైరల్‌

కక్కనాడ్ మేజిస్ట్రేట్ కోర్టులో విచారణ సందర్భంగా నటుడి విజయకుమార్‌ నేరాన్ని నిర్ధారించడానికి ప్రాసిక్యూషన్‌ ఎటువంటి సాక్ష్యాలను సమర్పించలేకపోయింది. ఈ కేసులో పోలీసు అధికారులు కాకుండా ఇద్దరు సాక్షుల వాంగ్మూలాలు నటుడికి అనుకూలంగా ఉన్నాయి. సాక్ష్యంగా ప్రాసిక్యూషన్ సమర్పించిన స్వతంత్ర సాక్షి వాంగ్మూలాలు నమ్మదగినవి కాదని కోర్టు ఎత్తి చూపింది. అసిస్టెంట్ కమీషనర్ కార్యాలయంలో సర్కిల్ ఇన్‌స్పెక్టర్ నేతృత్వంలో విచారణ సందర్భంగా విజయకుమార్ ఒక పోలీసును తోసివేసి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. పోలీసుల అధికారిక విధులకు ఆటంకం కలిగించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడనేది అతనిపై కేసు నమోదైంది. గతంలో, ట్రయల్ కోర్టు అతనిపై రూ. 25 లక్షల దోపిడీ కేసును కొట్టివేసింది. విజయకుమార్‌పై ఐదు కేసులు ఉన్నాయి. అన్ని కేసుల్లో కోర్టు అతడిని నిర్దోషిగా ప్రకటించింది.