NTV Telugu Site icon

Mohan Raj : ఇండస్ట్రీలో విషాదం.. గుండెపోటులో ఫేమస్ విలన్ కన్నుమూత

New Project (53)

New Project (53)

Mohan Raj : సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ఇండస్ట్రీ మరో అద్భుత నటుడిని కోల్పోయింది. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రముఖ విలన్ మోహన్ రాజ్ కన్నుమూశారు. 72ఏళ్ల వయసున్న ఆయన గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. నాలుగు రోజుల క్రితం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది. వెంటనే ఆయన కుటుంబ సభ్యులు హాస్పిటల్ కు తరలించారు. వైద్యులు ఆయనకు వెంటిలేటర్ మీద చికిత్స అందజేశారు. అయినప్పటికీ పరిస్థితి మెరుగుపడలేదు. గురువారం మధ్యాహ్నం ఆయన చనిపోయినట్లు కుటుంబసభ్యులు ప్రకటించారు.

Read Also:Pushpa2 : ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడో తెలుసా..?

నటుడు మోహన్ రాజ్ గత కొన్నాళ్లుగా పార్కిన్సన్స్‌ వ్యాధితో బాధపడుతున్నారు. ఇటీవలే ఆయనకు గుండె పోటు కూడా వచ్చింది. వెంటనే ఆయనను చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. అక్కడ కొద్ది రోజుల పాటు వైద్యులు ఆయనకు వెంటిలేటర్ మీద చికిత్స అందించారు. పరిస్థితి ఏమాత్రం మెరుగుపడకపోవడంతో తమ వల్ల కాదని డాక్టర్లు ఇంటికి తీసుకువెళ్లాలనని సూచించారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు తిరువనంతపురం సమీపంలోని ఆయన స్వగ్రామం కంజిరంకులంకు తీసుకెళ్లారు. ఇంటికి వెళ్లిన కాసేపటికే ఆయన కన్నుమూశారు. నటుడు, దర్శకుడు అయిన పి దినేశ్‌ పనికర్‌.. మోహన్ రాజ్ మరణ విషయాన్ని ధృవీకరించారు. సోషల్ మీడియా వేదికగా మోహన్ రాజ్ చనిపోయినట్లు ప్రకటించారు. నటుడు మోహన్‌ రాజ్‌ కు భార్య ఉష, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

Read Also:Bhadrachalam: శరన్నవరాత్రి ఉత్సవాలు.. నేడు ఆదిలక్ష్మి అలంకారంలో అమ్మవారు..

మలయాళంలో మోహన్‌ రాజ్‌ ‘కిరిక్కాడాన్‌ జోస్‌’గా బాగా పాపులర్ అయ్యారు. 1989లో సిబి మలయిల్‌ తెరకెక్కించిన ‘కిరీదామ్‌’ చిత్రంతో ఆయన బాగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన తెలుగు, తమిళ చిత్రాల్లోనూ ఆయన నటించారు. ‘లారీ డ్రైవర్‌’, ‘స్టువర్టుపురం పోలీస్‌ స్టేషన్‌’, ‘చినరాయుడు’, ‘నిప్పు రవ్వ’, ‘శివయ్య’, ‘అసెంబ్లీ రౌడీ’, ‘సమర సింహారెడ్డి’, ‘నరసింహనాయుడు’, ‘చెన్న కేశవరెడ్డి’, ‘శివమణి’ సహా పలు తెలుగు సినిమాల్లో విలన్ పాత్రలు పోషించి ఆకట్టుకున్నారు. తెలుగులో ఆయన చివరగా మోహన్ బాబు నటించిన ‘శివ శంకర్’ చిత్రంలో కనిపించారు. మోహన్ రాజ్ మృతి పట్ల తెలుగు, తమిళం, మలయాళం సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.