Site icon NTV Telugu

Malaika : డేటింగ్ రూమర్స్‌తో లైమ్ లైట్‌లోకి మలైకా అరోరా

Malaika Arora

Malaika Arora

మలైకా అరోరా అంటే ఐటమ్ సాంగ్స్‌ మాత్రమే కాదు.. డేటింగ్ వార్తలతో నిత్యం ట్రెండింగ్‌లో నిలుస్తూ ఉంటోంది. అదీ కూడా ఏజ్‌లో తన కన్నా చిన్న వాళ్లతో ప్రేమలో పడిపోతూ ఉంటోంది అమ్మడు. బాలీవుడ్ నటుడు అర్బాజ్ ఖాన్ నుండి విడాకులు తీసుకున్నాక.. తన కంటే 12 సంవత్సరాలు చిన్నవాడైన అర్జున్ కపూర్‌తో డేటింగ్ చేసింది మున్నీ. దాదాపు 6 ఏళ్లు లవ్, ఇష్క్, కాదల్‌లో మునిగి తేలింది ఈ జంట. ఇక పెళ్లి చేసుకోవడం ఖాయం అనుకునే టైంలో 2024లో కటీఫ్ చెప్పుకున్నారు ఈ ప్రేమ పక్షులు.

Also Read : SRK : ఆ హీరోయిన్ ను లక్కీ ఛామ్‌గా భావిస్తున్న కింగ్ ఖాన్

అర్జున్ కపూర్‌కు బ్రేకప్ చెప్పి ఏడాది కూడా గ్యాప్ ఇవ్వలేదు 52 ఏళ్ల మలైకా. మరో వ్యక్తికి తన హృదయంలో చోటు ఇచ్చింది. ప్రముఖ వ్యాపార వేత్త హర్ష్ మెహతాతో చక్కర్లు కొడుతోంది మేడమ్. మలైకా కన్నా అతడు 19 సంవత్సరాలు చిన్నవాడు కావడంతో మరోసారి ఈ జోడీ హాట్ టాపికయ్యింది. పార్టీలు, ఫంక్షన్స్‌తో పాటు రీసెంట్లీ వాలంటైన్స్ డేకు ఫారిన్‌లో ఈ లవ్ బర్డ్స్ ఎంజాయ్ చేసిన పిక్స్ వైరల్ అయ్యాయి.  హర్ష్ మెహతాతో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్న మలైకా.. సడెన్లీ మరొకరితో క్లోజ్‌గా ఉన్న వీడియో వైరల్ అవుతోంది. డేటింగ్ రియాలిటీ షో స్పిట్స్ విల్లా ఎక్స్6 ఫేమ్ సోరభ్ బేడీతో డ్యాన్స్ చేస్తున్న వీడియో నెట్టంట్లో షికార్ చేస్తోంది. దీంతో హర్ష్ బ్రేకప్ చెప్పి.. బేడీతో కమిటయ్యిందంటూ వార్తలు వచ్చాయి. ఈ రూమర్స్ యంగ్ బాయ్ చెవికి చేరినట్లున్నాయి. వెంటనే క్లారిటీ ఇచ్చేశాడు. ఆమె జస్ట్ తనకు బెస్ట్ ఫ్రెండ్ అని తేల్చి గాసిప్ రాయుళ్ల గాలి తీసేశాడు. ఇక మలైకా కెరీర్ విషయానికి వస్తే.. లాస్ట్ ఇయర్ థామాలో ఓ స్పెషల్ సాంగ్‌లో మెరిసిన మున్నీ.. మళ్లీ తెరపై కనిపించలేదు.

Exit mobile version