Site icon NTV Telugu

Sting Energy Drink Tea: అరె ఏంట్రా ఇది.. ‘టీ’లో ఎనర్జీ డ్రింక్.. వీడియో వైరల్

Sting Energy Drink Tea

Sting Energy Drink Tea

Sting Energy Drink Tea: దేశవ్యాప్తంగా దాదాపు ప్రతి వ్యక్తి టీతో తమ రోజును ప్రారంభిస్తారు. టీ తాగకుండా ఉండలేని వారు చాలా మంది ఉన్నారు. అలాంటి టీ ప్రియుల కోసం నేడు మార్కెట్‌ లో రకరకాల టీలు అందుబాటులో ఉన్నాయి. వేడి టీ నచ్చని వారికి కోల్డ్ టీ, పుల్లటి టీ ఇష్టపడే వారికి లెమన్ టీ, స్ట్రాంగ్ టీ ఇష్టపడే వారికి మసాలా టీ., వారి టీని కొంచెం తియ్యగా ఇష్టపడే వారికి ఇరానీ టీ.. అయితే, ఇన్ని రకాలు ఉన్న ఇప్పుడు కొత్త టీ తెరపైకి వచ్చింది. ఈ రకాన్ని స్టింగ్ ఎనర్జీ డ్రింక్ టీ అంటారు. ఈ టీ తాగడం వల్ల శక్తి వస్తుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ టీ సంబంధించిన వీడియో నెట్టింట వీర గా మారింది. మరి ఈ టీని ఎలా తయారు చేస్తారో చూద్దాం.

Trump Rally Firing: గతంలో.. ఎంత మంది అమెరికా అధ్యక్షులు కాల్పుల్లో మరణించారో తెలుసా..?

వైరల్ అవుతున్న వీడియో లో ముందుగా పాలలో పంచదార, టీ ఆకులు వేసి ఆ మిశ్రమాన్ని బాగా మరిగించాలి. అప్పుడు టీ మరుగుతున్న వెంటనే దానిలో స్టింగ్ ఎనర్జీ డ్రింక్ పోశారు. మరికాసేపు మరిగించిన తర్వాత స్టింగ్‌ వాలా టీ రెడీ. సరే, టీ గ్లాసులో పోసుకున్న తర్వాత అందులో మరికొంత స్టింగ్ కాల్ డ్రింక్ పోస్తున్నారు. ఈ వీడియోను తాజాగా ఇన్‌స్టాగ్రామ్ పేజీ f4foodi ద్వారా షేర్ చేశారు. ఈ టీని ఇప్పటివరకు 30 లక్షల మందికి పైగా నెటిజన్లు చూశారు. చాలా మంది దీనికి ఫన్నీ రియాక్షన్‌లు ఇచ్చారు.

Top Headlines @ 5PM : టాప్‌ న్యూస్

ఇక ఈ వీడియో చుసిన అనేకమంది కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇలాంటి విషపు టీ ని చేసిన అతనిని కఠినంగా శిక్షించబడాలని డిమాండ్ చేస్తున్నారు కొందరు. మరొకరు, ఈ టీలో ఇంకా కాస్త కొత్తగా హార్పిక్ ను కలపండి పీడ పోతుంది అంటూ కాస్త టీ ప్రియులు ఆగ్రహంగా స్పందిస్తున్నారు. మరి మీరు కూడా ఈ వీడియో చూసి మీకేమి అనిపించిందో ఓ కామెంట్ చేయండి.

Exit mobile version