NTV Telugu Site icon

Vinayaka Chavithi: ఇంట్లో ఉండే వస్తువులతో వినాయకుని విగ్రహం తయారీ

Untitled 12

Untitled 12

రేపు వినాయక చవితి. ఇప్పటికే ప్రతి చోట వినాయకుని విగ్రహాలు దర్శనమిస్తున్నాయి. కానీ వీటిలో మట్టితో చేసిన వాటికంటే ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌ తో చేసిన విగ్రహాలే ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఈ విగ్రహాలను వాడడం వల్ల నీరు కాలుష్యం అవుతుంది. మన భక్తి మన భవిష్యత్తుకి భరోసా ఇచ్చేలా ఉండాలి.. కానీ ప్రకృతిని పాడుచేసేలా ఉండకూడదు. కనుక మట్టితో చేసిన విగ్రహాలను వాడడం ఉత్తమం. మరి మట్టి విగ్రహాలు దొరకని వాళ్ళు మరియు వినాయకుని విగ్రహాన్ని తాయారు చేసి పూజించాలి అనుకునేవాళ్లు ఇంట్లో ఉండే వస్తువులతోనే సులువుగా వినాయకుని విగ్రహాన్ని తాయారు చెయ్యవచ్చు. ఎలా తయారు చెయ్యాలో ఇప్పుడు చూద్దాం

Read also:Asia Cup 2023 Final Live Updates: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక.. సుందర్ వచ్చేశాడు! తుది జట్లు ఇవే

న్యూస్ పేపర్లు , లేదా పాత పుస్తకాల కాగితాలు అందరికి అందుబాటులో ఉంటాయి. వీటితో కూడా వినాయకుని విగ్రహాన్ని తయారుచేయొచ్చు. ఇందుకోసం మొదటగా కాగితాలని నీటిలో నానబెట్టాలి. అనంతరం నానిన కాగితాలని మెత్తగా రుబ్బండి. ఇప్పుడు ఆ కాగితం గుజ్జుతో వినాయకుని విగ్రహాన్ని తాయారు చేయండి. విగ్రహాన్ని తయారు చేసేటప్పుడు ఫెవికాల్ ఉపయోగించండి. దీని వళ్ళ విగ్రహం విరిగిపోకుండా దృడంగా ఉంటుంది. తళుకులు, అద్దాలు, లేసులు ఉపయోగించడం ద్వారా ఈ విగ్రహం మరింత అందంగా ఉంటుంది. ఇంకా గోధుమ పిండిని ఉపయోగించి కూడా వినాయకుని విగ్రహాన్ని తయారు చెయ్యవచ్చు. ఇందుకోసం ముందుగా గోధుమ పిండిని కొద్దీ కొద్దిగా నీళ్లు ఉపయోగిస్తూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు దీని తో ముందుగా వినాయకుని ఆకారం తయారు చెయ్యాలి. తర్వాత కాళ్ళు,చేతులు, తొండం తయారు చేసి విగ్రహానికి జోడించాలి. విగ్రహం తయారీ పూర్తి అయిన తర్వాత నీడలో ఆరబెట్టాలి. అనంతరం నీళ్లలో కరిగే రంగులు వెయ్యాలి. వినాయకున్ని భక్తితో పూజిద్దాం. ప్రకృతికి కీడు వాటిల్ల కుండా బాధ్యత వహిద్దాం.

Show comments