NTV Telugu Site icon

New Business Idea: వాడిపోయిన పూలతో బిజినెస్.. కోట్లలో సంపాదన

Agar

Agar

New Business Idea: బిజినెస్ చేయాలనుకుంటే ఎన్నో ఉన్నాయి. కానీ ఆ బిజినెస్ లో సక్సెస్ కావాలంటే మాత్రం మన ఐడియా కొత్తగా ఇప్పటి వరకు ఎవరికీ రానిది అయ్యిండాలి. అలా అయితే మనం బిజినెస్ లో చాలా తొందరగా ఎదుగుతాం. ప్రస్తుతం రీసైక్లింగ్ బిజినెస్ లకు మంచి డిమాండ్ ఉంది. వాటి ద్వారా చాలా మంది కోట్లు సంపాదిస్తున్నారు. పాత ఇనుప సామాన్లు, కొబ్బరి పీచు, పాత ప్లాస్టిక్ బాటిళ్లు, సామాన్ల నుంచి కొత్త వస్తువులను తయారీ చేసి వాటిని మార్కెట్లలో విక్రయిస్తూ కోట్లు ఆర్జిస్తున్నారు. ఇలాంటి ఓ డిఫరెంట్ ఐడియాతోనే బిజినెస్ లో దూసుకుపోతున్నారు ఇద్దరు స్నేహితులు. అంకిత్‌ అగర్వాల్, ప్రతీక్‌ కుమార్‌ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్. అయితే వారు ఎన్పటి నుంచో ఓ మంచి బిజినెస్ చేయాలని ఆలోచిస్తూ ఉండేవారు. అయితే వారికి ఒక రోజు ఒక మంచి ఐడియా వచ్చింది. వాడిన పూలతో బిజినెస్ చేయాలనుకున్నారు.

Also Read:New Born Baby Starts Walking: పుట్టగానే నడిచిన బుడ్డోడు.. డాక్టర్లు షాక్

మన దేశంలో చాలా గుళ్లలో, శుభకార్యాలలో ఎక్కువగా పూలను ఉపయోగిస్తుంటారు.అయితే వాడి పోయిన తరువాత ఆ పూలను డస్ట్ బిన్స్ లో కానీ, నీటిలో కానీ పడేస్తూ ఉంటారు. దీని వల్ల నీరు కలుషితం కావడం లాంటి పర్యావరణ హానికర పరిస్థితులు ఏర్పడతాయి. అయితే ఇలా వాడిపోయిన పూలను వేస్ట్ కాకుండా పనికొచ్చేలా మార్చాలనుకున్నారు ఈ ఇద్దరు స్నేహితులు. వాటితో అగరబత్తీలు తయారు చేయడం ప్రారంభించారు. దీని ద్వారా కోట్లు సంపాదిస్తున్నారు. వీరు వాడిపోయిన పూలను సేకరించి అందులో మంచి వాసన వచ్చే పూలను ఎంచుకొని ఎండ బెట్టి పొడిగా చేస్తారు. తరువాత వాటికి కొన్ని రసాయనాలు కలిపి అగరబత్తీ పేస్ట్ లా చేసి తరువాత వాటిని అగరబత్తీ కడ్డీల లాగా చేసి విక్రయిస్తున్నారు. దీని ద్వారా కోట్లు సంపాదిస్తున్నారు. మన దేశంలో చాలా మంది పూజలు చేస్తూ ఉంటారు కాబట్టి అగరబత్తీలకు మంచి గిరాకీనే ఉంటుంది.