Site icon NTV Telugu

LEO : లియో మూవీ నుంచి క్రేజీ అప్డేట్ ఇచ్చిన మేకర్స్..

Whatsapp Image 2023 09 17 At 5.11.08 Pm

Whatsapp Image 2023 09 17 At 5.11.08 Pm

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి నటిస్తున్న లేటెస్ట్ మూవీ లియో.. ఈ సినిమా ను స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్నారు. విక్రమ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న తరువాత లోకేష్ డైరెక్ట్ చేస్తున్న మూవీ కావడంతో లియో సినిమా పై అంచనాలు భారీ గా వున్నాయి.. లియో సినిమా బిజినెస్‌ దాదాపు రెండు వందల కోట్ల పై నే అని సమాచారం.ఈ సినిమాను దసరా కానుక గా అక్టోబర్ 19 న ఎంతో గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు.లియో సినిమా. రిలీజ్‌ కు ఇంకా నెల రోజులకు పైగా సమయం ఉండటం తో చిత్రబృందం ఎంతో ఫాస్ట్ గా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు కంప్లీట్ చేసుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ విడుదలైంది. ఈ ఒక్క పాట తమిళ్ ఆడియన్స్ కు తెగ నచ్చేసింది.

ఇక రీసెంట్‌ గా సినిమా నుంచి సంజయ్‌ దత్‌, అర్జున్‌ గ్లింప్స్‌ లు రిలీజ్ అయి సినిమాపై భారీగా అంచనాలు పెంచేసింది.. ఇప్పటికే టాకీ పార్ట్‌ మొత్తం కంప్లీట్‌ అయిపోయింది. ప్రస్తుతం డబ్బింగ్‌ సహా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.లియో పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల అవుతుంది కాబట్టి ఈ సారి కాస్త పెద్ద ఎత్తున ప్రమోషన్‌ లు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం..మరీ ముఖ్యంగా తెలుగు లో కూడా ఈ సినిమా ప్రమోషన్‌లు భారీ ఎత్తు లో జరపాలని చూస్తున్నట్లు సమాచారం.ఎందుకంటే ఇటీవల కాలంలో తెలుగులో డబ్‌ అయిన కొన్ని తమిళ సినిమాలు ఊహించని రేంజ్‌లో కలెక్షన్‌లు రాబట్టినాయి.. దాంతో ఈ సినిమాను పెద్ద లెవల్లో ప్రమోట్‌ చేసి సినిమా పై క్రేజ్‌ను మరింత తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కాగా తాజాగా మేకర్స్‌ ఓ స్పెషల్ అప్‌డేట్‌ను ప్రకటించారు.. ఈ సినిమా తెలుగు పోస్టర్‌ను నేడు సాయంత్రం 6గంటలకు విడుదల చేయబోతున్నట్లు వెల్లడించింది

https://twitter.com/SitharaEnts/status/1703351490604310936?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1703351490604310936%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=http%3A%2F%2Fapi-news.dailyhunt.in%2F

Exit mobile version