Site icon NTV Telugu

Hyderabad: చాదర్ ఘాట్ లో రెచ్చిపోయిన దొంగలు.. 75 తులాల బంగారు నగలు, రూ.2.50 లక్షల నగదు చోరీ

Robbery

Robbery

చాదర్ ఘాట్ పీఎస్ పరిధిలో భారీ చోరీ జరిగింది. వ్యాపారి ఫహిముద్దీన్ ఇంట్లో 75 తులాల బంగారు నగలు .రూ.2.50 లక్షల నగదు ఎత్తుకెళ్లిన దొంగలు. ఫహిముద్దీన్ భార్య అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఫహిముద్దీన్ శుక్రవారం రాత్రి ఇంట్లో తల్లిదండ్రులను ఉంచి ఆసుపత్రికి వెళ్లాడు. ఇదే అదునుగా భావించిన ఆగంతకులు ఇంటి వెనక నుంచి లోనికి ప్రవేశించారు. ఫహిముద్దీన్ తల్లిదండ్రులు నిద్రిస్తున్న గదికి బయట నుంచి గొళ్లెంపెట్టారు నిందితులు.

Also Read:Doha Diamond league: నీరజ్ చోప్రా నయా హిస్టరీ.. తొలిసారి 90 మీటర్ల మార్కును దాటేశాడు..

దర్జాగా ఇంట్లోకి ప్రవేశించి రాత్రి చాలా సేపు తిష్ట వేశారు. ఫ్రిడ్జ్ లో పండ్లు తిని బీరువాలో ఉన్న బంగారం, నగదు ఇతర వస్తువులు చోరీ చేశారు. చోరీ అనంతరం నగలు నగదుతో అక్కడి నుంచి ఉడాయించారు. తెల్లవారు జామున ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చిన ఫహిముద్దీన్ కు షాక్ తగిలినట్లైంది. ఇంట్లో దొంగతనం జరిగినట్లు గుర్తించిన అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చాదర్ ఘాట్ పోలీసులు, క్లూస్ టీమ్ సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ టీం ఘటన స్థలానికి చేరుకున్నాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Exit mobile version