Maoists Surrender: ఆంధ్ర–ఒడిశా సరిహద్దు ప్రాంతం (ఏఓబీ)లో మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఒడిశా రాష్ట్రం మల్కాన్‌గిరి జిల్లాలో 22 మంది మావోయిస్టులు ఒడిశా డీజీపీ ఎదుట లొంగిపోయారు. వరుస ఆపరేషన్లు, భద్రతా బలగాల ఒత్తిడి నేపథ్యంలో ఈ లొంగుబాటుకు ప్రాధాన్యత సంతరించుకుంది. లొంగిపోయిన వారిలో ఆరుగురు డివిజనల్ కమిటీ సభ్యులు, ఆరుగురు ఏరియా కమిటీ సభ్యులు సహా మొత్తం 15 మంది కీలక మావోయిస్టు సభ్యులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరితో పాటు ఆయుధాలు, పేలుడు సామగ్రిని కూడా పోలీసులకు అప్పగించారు. ఇందులో ఒక ఏకే-47 రైఫిల్, రెండు ఇన్సాస్ రైఫిళ్లు, ఒక ఎస్‌ఎల్‌ఆర్ రైఫిల్, మూడు 303 రైఫిళ్లు, రెండు సింగిల్ షాట్ రైఫిళ్లు, అలాగే 14 ల్యాండ్‌మైన్‌లు ఉన్నాయి.
Betting Apps: ‘ఉచ్చు’లో సెలబ్రిటీలు: రీతూ చౌదరి, భయ్యా సన్నీ ఖాతాల్లో లక్షలాది రూపాయలు?
పోలీసుల సమాచారం ప్రకారం.. లొంగిపోయిన ఈ 22 మంది మావోయిస్టులపై మొత్తం రూ.2 కోట్ల 18 లక్షల 25 వేల రివార్డు ఉంది. ఈ లొంగుబాటుతో ఏఓబీ ప్రాంతంలో మావోయిస్టు కార్యకలాపాలకు భారీగా దెబ్బ తగిలిందని అధికారులు పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మార్చి 2026 నాటికి దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని ప్రకటించిన నేపథ్యంలో.. భద్రతా బలగాలు ఆపరేషన్ కగార్, ఆపరేషన్ కర్రెగుట్ట వంటి ప్రత్యేక దాడులను ముమ్మరం చేశాయి. ఈ ఆపరేషన్లలో పలువురు మావోయిస్టులు ఎన్‌కౌంటర్లలో హతమవుతుండగా, మరికొందరు పోలీసుల ఎదుట లొంగిపోతున్నారు.
