Mumbai Airport: ముంబయి ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం ఒక ఘోర ప్రమాదం తప్పింది. ఢిల్లీకి వెళ్లాల్సిన అకాసా ఎయిర్‌లైన్స్ QP1410 విమానం, టేకాఫ్‌కు ముందు ఓ కార్గో కంటైనర్ వాహనం ఢీకొనడంతో విమానానికి, కార్గో వాహనాలు డ్యామేజ్ అయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలలోకి వెళితే..
ఈ ఘటన సోమవారం తెల్లవారు జామున సుమారు 4:54 గంటలకు చోటు చేసుకుంది. బెంగళూరు నుంచి వచ్చిన QP1736 విమానం ముంబయికి చేరుకుని బే A-7 వద్ద పార్క్ చేయబడింది. ఇదే విమానం తరువాత QP1410గా ఢిల్లీకి బయలుదేరాల్సి ఉంది. అయితే, ప్రయాణికుల బోర్డింగ్‌కు ముందు కార్గో సంబధించిన పనులు కొనసాగుతున్న సమయంలో, BWFS (Bird Worldwide Flight Services) కు చెందిన ఓ కంటైనర్ వాహనం విమానం కుడి వైపు రెక్కను ఢీకొట్టింది.
Read Also:Air India crash: ఎయిర్ ఇండియా క్రాష్, “ఫ్యూయల్ స్విచ్”ల తనిఖీకి ఆదేశాలు..
ఈ ఘటనతో వెంటనే విమానాన్ని పరిశీలించిన అధికారులు, అది ప్రయాణానికి సురక్షితం కాదని గుర్తించారు. అందువల్ల Aircraft on Ground (AOG) గా ప్రకటించారు. తర్వాత అకాసా ఎయిర్‌లైన్స్ ప్రత్యామ్నాయంగా VT-VBB అనే మరో విమానాన్ని అందుబాటులోకి తెచ్చింది. అది బే V17R వద్ద పార్క్ చేయబడి ఉండగా.. ప్రయాణికులను గేట్-29 నుండి బస్సుల ద్వారా కొత్త విమానానికి తీసుకువచ్చారు. ఈ ఘటన పెద్ద ప్రమాదానికి దారితీయకపోయినా, ఎయిర్‌సైడ్ సేఫ్టీ (Airside Safety) పై అనేక ప్రశ్నలు రేకెత్తిస్తోంది. ప్రయాణికుల ప్రాణాలు ప్రమాదంలో పడే అవకాశముండగా.. అకాసా ఎయిర్, విమానాశ్రయ అధికారులు సమయానికి స్పందించి విమానాన్ని మర్చి చర్యలు చేపట్టారు.
Akasa Air's plane hit by a cargo truck at Mumbai airport, major accident averted
According to the airline, when the cargo truck came in contact with the plane, it was being driven by a third party ground handler. pic.twitter.com/LHmMgpKEGE
— Aditya Kumar Trivedi (@adityasvlogs) July 14, 2025
