Site icon NTV Telugu

Dhaka Airport: ఢాకా విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం.. తగలబడ్డ కార్గో టెర్మినల్

Dhaka

Dhaka

బంగ్లాదేశ్‌లోని ఢాకాలోని హజ్రత్ షాజలాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని కార్గో టెర్మినల్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఎయిర్ పోర్టులో పొగ దట్టంగా అలుముకుంది. దీంతో అధికారులు విమానాశ్రయంలో విమాన కార్యకలాపాలను నిలిపివేశారు. ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకున్న వస్తువులను నిల్వ చేసే విమానాశ్రయంలోని కార్గో టెర్మినల్ లో మంటలు చెలరేగాయి.

Also Read: Perni Nani: మంత్రి కొల్లు రవీంద్ర ఆస్తులపై పేర్నినాని సంచలన వ్యాఖ్యలు..

బంగ్లాదేశ్ మీడియా నివేదికల ప్రకారం, విమానాశ్రయం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మహ్మద్ మసుదుల్ హసన్ మసుద్ ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR) ప్రకారం, బంగ్లాదేశ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ, అగ్నిమాపక సేవ, బంగ్లాదేశ్ వైమానిక దళ అగ్నిమాపక సిబ్బంది కలిసి మంటలను అదుపులోకి తెచ్చినట్లు వెల్లడించారు.

Also Read:Dhanteras 2025: ధన్ తేరాస్ స్పెషల్: ఈ 10 వస్తువులు కొంటే అదృష్టం మీవెంటే!

హజ్రత్ షాజలాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఫ్లైట్ ల్యాండింగ్‌లు, టేకాఫ్‌లు రద్దు చేశామని తెలిపారు. అగ్నిప్రమాదానికి గల కారణం, నష్టం ఎంతవరకు జరిగిందనేది ఇంకా స్పష్టంగా వెల్లడించలేదు. అన్ని విమానాలు సురక్షితంగా ఉన్నాయని విమానాశ్రయ ప్రతినిధి ఒకరు చెప్పినట్లు డైలీ స్టార్ పేర్కొంది. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు.

Exit mobile version