Atchutapuram: విశాఖ జిల్లా అచ్యుతాపురంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో భారీ సైబర్ డెన్ ను గుర్తించారు పోలీసులు. దీనితో ఆ ప్రాంతంలో తనిఖీలు ముమ్మరం చేశారు. ఈశాన్య రాష్ట్రాల నుంచి యువతి, యువకులను తీసుకువచ్చి సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే కొందరిని అదుపులోకి తీసుకొని పరవాడ పోలీస్ స్టేషన్ కు తరలించారు. విజయనగరం ఉగ్ర మూలాలతో ఇప్పటికే పోలీసులు అలర్ట్ అయ్యారు. ఈ సమయంలో భారీ సైబర్ డెన్ బయటపడటంతో వివిధ కోణాలలో పరిశీలిస్తున్నారు. దీంతో సైబర్ ఎక్స్పర్ట్స్ రంగంలోకి దిగారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి రెండు బిల్డింగులను అదుపులోకి తీసుకున్నారు. ఈ రెండు బిల్డింగులలో దాదాపు 160 మంది ఉద్యోగులు ఉన్నట్లుగా సమాచారం. వారందరికీ ప్రతినెలా క్యాష్ పేమెంట్ ద్వారా జీతాలు చెల్లిస్తూ ఉన్నారు. అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా ఆధ్వర్యంలో టెక్నికల్ ఆధారాలను సేకరించే పనిలోపడ్డారు పోలీసులు.
Read Also: Cyber Crime: కామారెడ్డిలో సైబర్ మోసం.. 5.8 లక్షలు రికవరీ చేసిన పోలీసులు..!
ఇక తాజా సమాచారం ప్రకారం.. “సైబర్ డెన్” కేసులో కీలక డేటాను ఐటీ, సైబర్ క్రైమ్ ఎక్స్ పర్ట్స్ సేకరించే పనిలో పడ్డారు. రెండు కాల్ సెంటర్ల లో 160మందికి పైగా యువతీ , యువకులతో కార్యకలాపాలు జరిగినట్టుగా పోలీసులు గుర్తించారు. ఇక దీనికి సంబంధించి ముంబైకి చెందిన మహిళను కీలక సూత్రధారిగా గుర్తించినట్లు సమాచారం. అచ్యుతాపురంలో సైబర్ డెన్ పెట్టి విదేశీయులకు వల విసురుతున్నట్టు ప్రాథమిక సమాచారం. రెండేళ్లుగా అత్యంత గోప్యంగా కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం. అచ్యుతాపురాన్ని ఎంచుకోవడం వెనుక కారణాలపై కూడా ఆరా తీస్తున్న పోలీసులు. యువతీయువకులు ఎక్కువ మంది అపార్ట్మెంటలో ఉండటంపై అనుమానంతో గతంలోనే పోలీసులు దృష్టికి వచ్చినా ఎందుకు సీరియస్ గా తీసుకోలేదనే కోణంలోనూ ఆరా తీస్తున్నారు అధికారులు. సైబర్ డెన్ కేసును స్వయంగా పర్యవేక్షిస్తున్నారు ఎస్పీ తుహీన్ సిన్హా.
