Ambala Road Accident: ఢిల్లీ-జమ్మూ జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మరణించారు. ఈ ఘటనలో 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం అంబాలా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అంబాలాలో ఈ ప్రమాదం జరిగింది. అందుతున్న సమాచారం ప్రకారం.. ట్రక్కును మినీ బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ట్రక్కు హైవేపై అకస్మాత్తుగా బ్రేకులు వేయడంతో వెనుక నుంచి వస్తున్న మినీ బస్సు ఢీకొందని పోలీసుల విచారణలో తేలింది.
Read Also:Pushpa 2 : స్పెషల్ సాంగ్ లో నటించనున్న యానిమల్ బ్యూటీ.. క్రేజీ న్యూస్ వైరల్..?
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూపీలోని బులంద్‌షహర్ నుంచి భక్తులు మాతా వైష్ణో దేవిని దర్శించుకునేందుకు మినీ బస్సులో వెళ్తున్నారు. తమ మినీ బస్సు కంటే ముందు వెళ్తున్న ట్రక్కు ఒక్కసారిగా బ్రేకులు వేసిందని ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న ఇతర వ్యక్తులు తెలిపారు. దీంతో మినీ బస్సు ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటనలో చనిపోయిన ఏడుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు. ఈ ఘటనలో గాయపడిన ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, నలుగురు వ్యక్తులు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
Read Also:Mermaid Show Kukatpally: హైదరాబాద్ లో ప్రత్యక్షమైన సాగర కన్యలు.. చూసేందుకు ఎగబడ్డ జనం
ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఏడుగురు మరణించారని, పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యుల సమాచారం మేరకు అంబాలాలోని పడవ్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ దిలీప్ తెలిపారు. పరిస్థితి విషమంగా ఉన్న వారిని సమీపంలోని పెద్ద ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనలో గాయపడిన వారిలో కొంతమంది సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితిని పరిగణనలోకి తీసుకొని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.