Site icon NTV Telugu

Alluri Seetharamaraju: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు తప్పిన పెను ప్రమాదం.. పెళ్లి బృందం ప్రాణాలు కాపాడిన బండరాయి

Bus

Bus

మారేడుమిల్లి – చింతూరు ఘాట్ రోడ్డులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లోయలోకి దూసుకెళ్లింది. పెద్ద బండరాయిని ఢీ కొట్టి బస్సు నిలిచిపోవడంతో 30 మంది ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. రాజమండ్రికి చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో చత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని జగదల్ పూర్ కు పెళ్లి బృందం వెళ్లి వస్తుండగా అర్థరాత్రి ఈ ఘటన జరిగింది.

Also Read:Paris: పీఎస్‌జీ ఛాంపియన్స్ విజయోత్స వేడుకల్లో ఘర్షణ.. ఇద్దరు మృతి

చక్రాలు లోయలోకి వెళ్లిపోవడంతో డ్రైవర్ సీట్ నుంచి ఒక్కొక్కరుగా ప్రయాణికులు బయటపడ్డారు. మారేడుమిల్లి – చింతూరు ఘాట్ రోడ్ లో అతి ప్రమాదకరమైన ఇజ్జలూరు టర్నింగ్ వద్ద ఈ ఘటన జరిగింది. బండరాయి 30 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడింది. బండరాయి ఉండటంతో 60 అడుగుల లోయ వద్ద ట్రావెల్స్ బస్సు నిలిచిపోయి ప్రయాణికులు పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు.

Exit mobile version