Majji Srinivasa Rao: వైసీపీకి బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు రాజీనామా

  • విజయనగరంలో వైసీపీకి ఎదురుదెబ్బ
  • వైసీపీకి బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు రాజీనామా
  • వైసీపీ అధినేత జగన్‌కు పంపించిన రాజీనామా లేఖ
Ycp

Ycp

విజయనగరంలో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది.  వైసీపీకి మజ్జి శ్రీనివాసరావు రాజీనామా చేశారు. మజ్జి శ్రీనివాసరావు బొత్స సత్యనారాయణ మేనల్లుడు. రాజీనామా లేఖను వైసీపీ అధినేత జగన్‌కు పంపించారు. భీమిలి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త పదవికి కూడా రాజీనామా చేశారు. అలాగే  వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి సైతం రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.

తనకు వివిధ హోదాలు, పదవులు కల్పించిన వైఎస్ జగన్‌‌కు మజ్జి శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపారు. తనను అన్ని విధాలా ప్రోత్సహించిన జగన్‌‌కు ధన్యవాదాలు అంటూ పేర్కొన్నారు. కొన్నాళ్లుగా బొత్స, చిన్న శ్రీను మధ్య కోల్డ్‌వార్‌ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే రాజీనామా చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది.