NTV Telugu Site icon

MLA MahipalReddy : అర్థంపర్థంలేని ఆరోపణలు కాదు.. ప్రూఫ్‎లున్నాయా

Mahipal

Mahipal

MLA Mahipal Reddy: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ పై ఫైర్ అయ్యారు. జీఎంఆర్ కన్వన్షన్ సెంటర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నందీశ్వర్ గౌడ్ చేసిన అరాచకాలను, అక్రమాలను ఎండగట్టారు. 1987లో ఏ గుర్తింపు లేని నందీశ్వర్ దివంగత మాజీ మంత్రి పి. రామచంద్ర రెడ్డి పుణ్యమా అని, పి. రామచంద్రారెడ్డి బొమ్మ పెట్టుకొని ప్రత్యక్ష ఎన్నికల్లో మండల పరిషత్ అధ్యక్షుడవయ్యావని ఆరోపించారు. తన ఆఫీసును తానే తగలపెట్టించుకుని, నక్సలైట్ల దాడి జరిగిందని, నక్సలైట్ల హిట్ లిస్టులో ఉన్నానంటూ నాటకాలాడి గన్ మెన్లను అలాట్ చేయించుకొన్నవన్నారు. బస్టాండ్ ఆవరణలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తానని, పరిశ్రమలలో చెందాలు వసూలు, విగ్రహం పెట్టకుండా చందాలు జేబులో వేసుకొన్న చరిత్ర నీది కాదా అంటూ ప్రశ్నించారు.

Read Also: MLA Sayanna: నిజాం వారసులకు దక్కిన గౌరవం సాయన్నకు దక్కలేదు : బీజేపీ

గతంలో ఉన్న టోల్ గేట్ ప్రోగ్రెసివ్ వాళ్ల నుంచి ప్రతినెల వసూలు చేసిన మామూళ్లను ఎవ్వరు మర్చిపోలేరన్నారు. మార్కెట్లో ఆయన కుటుంబసభ్యులు వైన్స్ పైన చేసిన దాడిని సృష్టించిన అరాచకాలను ఎవ్వరు మర్చిపోలేరన్నారు. బిగ్ బాస్ షో ఫేమ్ (ఆర్టిస్ట్) పై నీ కొడుకు ఆశిష్ గౌడ్ తాగిన మత్తులో దాడి చేస్తే, మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు (948/2019) బుక్కైన విషయం జనం మర్చిపోలేరన్నారు. మండల పరిషత్ ఆవరణలో గల దుకాణాల సముదాయములో దుకాణాలు “అలాట్” చేయిస్తానని ప్రతి దుకాణందారు దగ్గర రూ. 10వేల చొప్పున, ఆరోజుల్లో ఐదు లక్షల రూపాయలు వసూలు చేసిన విషయం ఎవ్వరు మర్చిపోలేరన్నారు. అలాగే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మార్వాడిల దగ్గర ప్రతినెల మామూళ్లు వసూలు చేసిన విషయం జనం మర్చిపోలేదన్నారు.

Read Also: Marriage : పెళ్లికి ముందే విరిగిన మంచం… ముఖం చాటేసిన వరుడు

గుడిని గుడిలో లింగాన్ని మింగే పెద్దమనిషి శివరాత్రి జాగరణపై మాట్లాడడం విడ్డూరమన్నారు. వాళ్ల పుట్టు పూర్వోత్తరాలన్నీ తనకు తెలుసునని.. మాట్లాడేటప్పుడు ప్రూఫ్ చేయాలంటూ సవాల్ చేశారు. రామాలయం భూములు కబ్జాకు పెట్టారనడంలో ఎలాంటి నిజం లేదు. ఏడెకరాల 27 గుంటలు రామాలయంకు సంబంధించి సర్వే నంబర్ 254, 255, 257,259,261 లో ఎలాంటి భూమి ఆక్రమణకు గురికాలేదు. నందన్న పటాన్ చెరులో బొడ్డు రాయి ఎక్కడుందో చెప్పాలని డిమాండ్ చేశారు. రేపు బొడ్డురాయి చూపిస్తే తాను రాజకీయాలనుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు.

Show comments