Mahindra Thar ROXX Bookings: ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ ‘మహీంద్రా అండ్ మహీంద్రా’ ఇటీవల 5 డోర్ మహీంద్రా థార్ రాక్స్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఆన్‌లైన్ బుకింగ్‌లు ప్రారంభం కాకముందే ఈ కారుకు ఫుల్ క్రేజ్ ఏర్పడింది. ప్రస్తుతం ఆన్‌లైన్ బుకింగ్‌ల కోసం చాలామంది వెలయికళ్లతో ఎదురుచూస్తున్నారు. అలాంటి వారికి ఓ శుభవార్త. అక్టోబర్ 3న ఉదయం 11 గంటలకు థార్ రాక్స్ ఆన్‌లైన్ బుకింగ్‌లు ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని కంపెనీ తన ఎక్స్ ఖాతా ద్వారా ప్రకటించింది. దసరా నుంచి డెలివరీలు మొదలవుతాయని పేర్కొంది.
న్యూఢిల్లీ, బెంగళూరు, ముంబై వంటి నగరాల్లో వినియోగదారులు మహీంద్రా థార్ రాక్స్ కోసం రెండు నెలలు వేచిఉండాల్సి వస్తుందని తెలుస్తోంది. పూణె, చెన్నై, జైపూర్, అహ్మదాబాద్‌లలో మూడు నెలల వరకు ఉంటుంది. ఆన్‌లైన్ బుకింగ్‌లు ప్రారంభమైన తర్వాత ఈ నిరీక్షణ పెరిగే అవకాశం ఉంది. మహీంద్రా థార్ రాక్స్ కోసం జనాలు భారీగా ఎదురుచూస్తున్నారట. ఈ కారు ధరలు రూ.12.99 లక్షల నుంచి రూ.22.49 లక్షలు (ఎక్స్ షోరూమ్) వరకు ఉన్నాయి.
Also Read: Amazon Smart TV Offers: 56 శాతం డిస్కౌంట్.. 12 వేలకే 40 ఇంచెస్ స్మార్ట్ టీవీ!
పెట్రోల్, డీజిల్ రెండు ఆప్షన్లలో థార్ రాక్స్‌ను మహీంద్రా విడుదల చేసింది. పెట్రోల్ బేసిక్ వేరియంట్ ధర రూ.12.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుండగా.. డీజిల్ వెర్షన్ రూ.13.99 లక్షల (ఎక్స్- షోరూమ్) నుంచి మొదలవుతుంది. 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 160 బీహెచ్‌పీ శక్తిని, 330ఎన్‌ఎమ్ టార్క్‌ని అందిస్తుంది. 2.2 లీటర్ల డీజిల్ ఇంజిన్ 150 బీహెచ్‌పీ శక్తిని, 330ఎమ్‌ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. రెండు ఇంజిన్లు సిక్స్ స్పీడ్ మాన్యువల్, ఆటో మెటిక్ గేర్ బాక్స్‌తో వస్తున్నాయి. అత్యంత భద్రతా పరమైన ఫీచర్లతో థార్ రాక్స్‌ను మహీంద్రా తీసుకొచ్చింది. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ సదుపాయం ఉంది.