కార్ల షోరూంకి వెళ్లే వినియోగదారుల పట్ల కొంతమంది సిబ్బంది దారుణంగా ప్రవర్తిస్తూ వుంటారు. పంచె కట్టుకుని కారుకొనేందుకు వెళ్ళిన రైతుని అవమానపరిచాడో సేల్స్ మ్యాన్. అయితే, రైతు ఆ సేల్స్ మ్యాన్ కి ధీటైన జవాబిచ్చాడు. అచ్చం స్నేహం కోసం సినిమా తరహాలోనే ఒక సీన్ కర్నాటకలోని ఓ మహీంద్రా షోరూమ్‌లో జరిగింది.
మహీంద్రా బొలెరో కొనేందుకు ఓ రైతు షోరూమ్‌కు వెళ్ళాడు. రైతు, అతని పాటు వెళ్లిన స్నేహితుల్ని చూసి బొలెరో రూ10 కి రాదని వారిని అవమానించాడు సేల్స్ మేన్. అయితే రైతు కెంపె గౌడ మాత్రం అతనికి షాకిచ్చాడు. ఈ సంఘటన మొత్తం అక్కడే ఉన్న ఒకరు రికార్డు చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయగా ఆ దృశ్యాలు వైరల్‌గా మారాయి. రైతును ఉద్దేశిస్తూ సేల్స్‌మ్యాన్ అసభ్యకరంగా మాట్లాడుతున్నట్లు వీడియోల్లో ఉంది.
దీనిపై రైతు కెంపెగౌడ మాట్లాడుతూ కారు కొనేందుకు వెళ్ళిన తనను సేల్స్ మేన్ అవమానించాడు. గంటలో రూ.10 లక్షలు పట్టుకెళ్ళిన రైతు వెంటనే తనకు కారు కావాలన్నాడు. అయితే సేల్స్ మేన్ తన తప్పుని తెలుసుకుని క్షమాపణ చెప్పాడు. వెంటనే డెలివరీ కుదరదని, మూడురోజుల్లో బొలెరో డెలివరీ చేస్తామన్నాడు. రైతు మాత్రం సేల్స్ మేన్ రాతక పూర్వకంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాడు. వారు క్షమాపణ పత్రం ఇచ్చారు. వెంటనే అక్కడినించి నేరుగా పోలీస్ స్టేషన్లో షోరూమ్ సిబ్బందిపై ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి రాజీ కుదిర్చారు. మనుషుల వస్త్రాలను బట్టి వారి ఆర్థికస్థాయిని అంచనా వేయడం తప్పని మహీంద్రా షోరూం వారికి అర్థమైంది.
