NTV Telugu Site icon

Ramdev Baba: రాందేవ్ బాబా దిష్టిబొమ్మ దగ్ధం… మహిళా కాంగ్రెస్ ఆందోళన

Ramdev

Ramdev

మహిళల దుస్తులపై రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి కారణం అయ్యాయి. మహిళల దుస్తులపై రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యలపై మహిళా కాంగ్రెస్ నిరసనకు దిగింది. రాందేవ్ బాబా దిష్టి బొమ్మ దగ్ధం చేసిన మహిళా కాంగ్రెస్ నేతలు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ఆందోళనల్లో మాజీ మంత్రి గీతారెడ్డి, మహిళా కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. మహిళా కాంగ్రెస్ ఆందోళనలతో ట్రాఫిక్ జాం ఏర్పడింది. పోలీసులు ట్రాఫిక్ ని క్లియర్ చేశారు. రాందేవ్ బాబా వెంటనే క్షమాపణలు చెప్పాలని మహిళా కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఈ మాట వేరే పార్టీ వాళ్ళు అన్ని వుంటే ఇప్పటికీ బత్తాయిలు , హిందూ వ్యతిరేకి, దేశ ద్రోహి ని అన్ని రచ్చ చేసేవారని అంటున్నారు.

ప‌తంజ‌లి యోగా పీఠ్‌, ముంబై మ‌హిళా ప‌తంజ‌లి యోగా స‌మితి ఆధ్వర్యంలో థానేలో జ‌రిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మ‌హిళ‌లు చీర‌ల్లో బాగుంటార‌ని, స‌ల్వార్ సూట్లలో కూడా బాగానే క‌నిపిస్తార‌ని, నా క‌ళ్లకు అయితే వాళ్లు దుస్తులు ధ‌రించ‌కున్నా బాగుంటార‌ని బాబా రాందేవ్ నోరు జారారు. యోగా క్లాసుకు వ‌స్తున్న మ‌హిళ‌ల‌ను ఉద్దేశిస్తూ ఆయ‌న ఈ వ్యాఖ్యలు చేశారు. బాబా రాందేవ్ మాటలపై రచ్చ రేగుతోంది.మహిళా సంఘాలు బాబా రాందేవ్ క్షమాపణలు చెప్పాలంటున్నాయి.

గతంలోనూ రాందేవ్ బాబా వివాదాలకు కేంద్రబిందువు అయ్యారు. కరోనా రెండో వేవ్ సమయంలో బాబా రాందేవ్ అల్లోపతి వైద్య విధానాలపై చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమారం రేపాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. “అల్లోపతి మందుల వల్ల లక్షల మంది మరణించారు. వారికి చికిత్స లేదా ఆక్సిజన్ అందక మరణించిన వారి కంటే చాలా ఎక్కువ. అల్లోపతి మూర్ఖమైన, దివాళా తీసిన శాస్త్రం” అని కూడా యోగా గురువు రాందేవ్ బాబా పేర్కొన్నారు. కరోనావైరస్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న తర్వాత కూడా భారతదేశంలో చాలా మంది వైద్యులు మరణించారని ఆయన పేర్కొన్నారు.

Read ALso:Team India: టీమిండియాకు మరో విరాట్ కోహ్లీ దొరికేశాడా?

ఈ వ్యాఖ్యలతో కూడిన వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో భారత వైద్య మండలితో పాటు అప్పటి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్లోపతి వైద్య విధానాన్ని ఆయన కించపరుస్తున్నారంటూ వైద్య మండలి మండిపడింది. ఇది కాస్తా తీవ్ర వివాదాస్పదం కావడంతో రాందేవ్‌ బాబా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. బాబా రాందేవ్ పై సుప్రీంకోర్టు గతంలోనూ అసహనం వ్యక్తం చేసింది.