మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం భోళా శంకర్.. ఈ సినిమాను మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాలో చిరంజీవి సరసన తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది… కీర్తి సురేష్ చిరు చెల్లెలుగా నటిస్తుంది. మహతి స్వర సాగర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాను ఆగస్టు 11న గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు.రీసెంట్ గా చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాతో భారీ విజయం సాధించారు.దీనితో భోళా శంకర్ సినిమాపై కూడా అంచనాలు భారీగా పెరిగాయి.. ఈ చిత్రం తమిళ్ సూపర్ హిట్ సినిమా వేదాళం సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతుంది. రీసెంట్ గా ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. చిరంజీవి ఈ సినిమాకు సంబంధించి డబ్బింగ్ పనులను కూడా పూర్తి చేసుకొని వెకేషన్ కు వెళ్లడం జరిగింది.
అలాగే ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ కూడా మెదలు పెట్టారు.ఇప్ప.టికే ఈ సినిమా నుంచి టీజర్ మరియు రెండు సాంగ్స్ కూడా విడుదల చేసారు.రెండు సాంగ్స్ కూడా చార్ట్ బస్టర్ కాగా టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. అలాగే ఈ సినిమా నుండి వచ్చిన సెకండ్ సింగిల్ ”జామ్ జామ్ జజ్జనక”సాంగ్ లాంచ్ లో మెహర్ రమేష్ చేసిన కామెంట్స్ నెట్టింట బాగా వైరల్ అయ్యాయి. ఈయన మాట్లాడుతూ.. భోళా శంకర్ టీజర్ విడుదల అయ్యాక మహేష్ బాబు గారు నాకు ఫోన్ చేసి అద్భుతంగా ఉందని చెప్పినట్లు ఆయన తెలిపారు.. మహతి స్వర సాగర్ అందించిన బ్యా గ్రౌండ్ స్కోర్ కూడా బాగా నచ్చింది అని మహేష్ చెప్పినట్లు ఆయన తెలిపారు.. చిరంజీవి మరియు మహేష్ బాబు మధ్య మంచి అనుబంధం ఉంది. మహేష్ సినిమాలకు కూడా చిరంజీవి ఆల్ ది బెస్ట్ చెబుతూ ట్వీట్స్ కూడా చేస్తుంటారు.. ప్రస్తుతం ఈ సినిమా గురించి మహేష్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.