Site icon NTV Telugu

Mahesh Kumar Goud : కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు వస్తున్నాయి

Mahesh Kumar Goud

Mahesh Kumar Goud

క్రోధి నామ సంవత్సరంలో కోపం తగ్గించుకొని కార్యకర్తలంతా పాజిటివ్ దృక్పథంతో పనిచేయాలని ఎమ్మెల్సీ, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్​ కుమార్ గౌడ్ అన్నారు. ఇవాళ ఆయన ఉగాది పండుగను పురస్కరించుకొని ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మహేష్‌ కుమార్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు వస్తున్నాయన్నారు. ప్రజల అభీష్టం మేరకు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో అద్భుతంగా పాలన కొనసాగిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రతీ కార్యకర్త అలర్ట్‌గా ఉండాల్సిన అవసరం ఉన్నదని వివరించారు.

 

రాష్ట్రంలో మెజార్టీ సీట్లు రాబట్టాలని, తద్వారా కేంద్రంలోనూ పవర్‌లోకి వస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. గత ఉగాది వేడుకల్లో కాంగ్రెస్ గెలుస్తుందని పంతులు చెప్పినట్లే జరిగిందన్నారు. అప్పుడు కొంత మంది ఆశ్చర్యం వ్యక్తం చేసినా, గెలిచిన తర్వాత పరిస్థితులు అందరికీ అర్ధమయ్యాయన్నారు మహేష్​ కుమార్ గౌడ్. ఈసారి కూడా పార్టీకి మంచి జరుగుతుందన్నారు. స్వల్ప పాటి విపత్తులు ఉన్నప్పటికీ, సమర్ధవంతంగా ఎదుర్కొని పార్టీని ముందుకు తీసుకువెళ్తామన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 14 నుండి 15 సీట్లులో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు మహేష్​ కుమార్ గౌడ్.

 

Exit mobile version