NTV Telugu Site icon

Mahesh Kumar Goud : దేశంలో కులాలు ఉన్నంత వరకు రిజర్వేషన్స్ ఉంటాయని ఖర్గే చెప్పారు..

Mahesh Kumar Goud

Mahesh Kumar Goud

హోటల్ హరిత ప్లాజాలో కామారెడ్డి డిక్లరేషన్ కు అనుగుణంగా సమగ్ర కులగణన బీసీ రిజర్వేషన్స్ పెంపుపై రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్.. మాజీ ఎంపీ వీహెచ్.. బీసీ సంఘాల నేతలు.. ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. దేశంలో కులాలు ఉన్నంత వరకు రిజర్వేషన్స్ ఉంటాయని ఖర్గే చెప్పారన్నారు. ధైర్యంగా బీసీల కులగణన గురించి మాట్లాడుతున్న ఛాంపియన్ రాహుల్ గాంధీ అని, ఎవరికి దక్కాల్సిన వాటా వారికి దక్కాలనే కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ఇచ్చామన్నారు మహేష్‌ కుమార్‌ గౌడ్‌. డిక్లరేషన్ ను ప్రవేశ పెట్టే బాధ్యత కూడా రేవంత్ రెడ్డి నాకే ఇచ్చారని, డిక్లరేషన్ కు ముందు కొన్ని మార్పుల కోసం కూర్చుంటే మీరు చేయండి నేను ఉన్నాను అని రేవంత్ చెప్పారన్నారు. కాళేశ్వరం ఒక పనికిరాని ప్రాజెక్ట్.. రాష్ట్రం అప్పుల్లో ఉందని, ఎంత ఇబ్బందులు ఉన్నా ప్రభుత్వం కమిట్మెంట్ తో పని చేస్తుందన్నారు మహేష్‌ గౌడ్‌.

 
Stock market: లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
 

అంతేకాకుండా..’కులగణన జరగనది రాష్ట్రంలో ఎన్నికలు అసలు జరగవు.. అసెంబ్లీలో బిల్లు కూడా పెట్టాం.. మరో నాలుగైదు రోజుల్లో కులగణనకు సంబంధించిన విధివిధానాలు రావొచ్చు.. కులగణనపై ఎటువంటి అపోహలు వద్దు.. పీసీసీగా చెప్తున్నా.. కులగణన చేయకపోతే నేను ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని రేవంత్ కు చెప్పాను.. కులగణనపై రేవంత్ ఒప్పుకున్నారు.. ముందుకు వెళ్దాం అని సీఎం అన్నారు.. కులగణన మాట తీయగానే BRS వాళ్లు విమర్శలు చేస్తున్నారు.. ఇంపోర్టెడ్ కార్ లలో ఎవరు తిరుగుతున్నారో చూస్తున్నాం.. అందుకే వాళ్లని ఇంటికి పంపించారు.. RSS చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్స్ తీసేస్తాం అని చెప్పారు.. ఇప్పుడు బీజేపీ మాట మార్చింది.. రాహుల్ గాంధీని చూసి బీజేపీ భయపడుతుంది.. అందుకే రిజర్వేషన్స్ పై మాట మార్చారు బిజెపి నాయకులు.. బీజేపీ కులగణన వ్యతిరేకిస్తుంది.. బీసీ ప్రధానిగా ఉన్నాడు అని బిజెపి చెప్తుంది.. ఏ బీసీకి న్యాయం జరిగింది.! అంబానీ.. అదానీ ఆస్తులు ఎలా పెరిగాయి.! వీరు ఏ వర్గం వాళ్లు.! ఎవరి అండతో వీళ్లు సంపాదిస్తున్నారు.!

Musk “Dating” Meloni: ఇటలీ పీఎం జార్జియా మెలోనితో ఎలాన్ మస్క్ డేటింగ్.? వైరల్ ఫోటోపై మస్క్ క్లారిటీ..

BRS తమ పార్టీ అధ్యక్షుడ్ని మార్చగలదా.! బీసీని అధ్యక్షుడుని చేయగలదా.. నాలుగు యూనివర్సిటీల వీసీలు బీసీలకు ఇవ్వాలని కోరాను.. సీఎం ఒప్పుకున్నారు.. సీఎం రేవంత్ కు నాకు ఉన్న సఖ్యత వల్ల పార్టీ పాలన రెండు సాఫీగా సాగుతాయి.. బీసీల కులగణన కాంగ్రెస్ పార్టీ పేటెంట్ రైట్.. రాహుల్ గాంధీ మది నుంచి వచ్చిన ఆలోచన.. నేను.. సీఎం ఎవరైనా రాహుల్ గాంధీ ఆదేశాల మేరకే నడుచుకుంటాం.. కులాభిమానం ఉండాలి కానీ కుల పిచ్చి ఉండొద్దు.. అన్ని కులాలు ఒకటిగా ఉండాలి.. రాష్ట్ర ముఖ్యమంత్రికి నిర్దిష్టమైన ఆలోచన ఉంది.. దానికి అనుగుణంగా అడుగులు పడుతున్నాయి..’ అని మహేష్‌ కుమార్‌ గౌడ్‌ అన్నారు.