NTV Telugu Site icon

SSMB29 : రాజమౌళి సినిమాకోసం భారీ రిస్క్ చేస్తున్న మహేష్..?

Ssmb29

Ssmb29

SSMB29 : సూపర్ స్టార్ మహేష్ ఈ ఏడాది సంక్రాంతి కానుకగా “గుంటూరు కారం” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ సినిమా మంచి విజయం సాధించింది.ఇదిలా ఉంటే ప్రస్తుతం ఫ్యాన్స్ మహేష్ తరువాత సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.మహేష్ తన తరువాత సినిమాను దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో చేస్తున్నాడు .ఈ సినిమాను దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై కే.ఎల్ .నారాయణ భారీ బడ్జెట్ తో ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారని సమాచారం.ఇప్పటికే రాజమౌళి సినిమాకోసం మహేష్ తన లుక్ ని చేంజ్ చేసాడు.లాంగ్ హెయిర్ ,గుబురు గడ్డంతో మహేష్ లుక్ అదిరిపోయింది.

Read Also :Game Changer : అదిరిపోయే స్పెషల్ సాంగ్ ను ప్లాన్ చేస్తున్న శంకర్.. మాస్ బీట్స్ సిద్ధం అవుతున్న తమన్..?

ఈ సినిమాను దర్శకుడు రాజమౌళి బిగ్గెస్ట్ అడ్వెంచరస్ మూవీగా తెరకెక్కిసున్నట్లు సమాచారం.ప్రస్తుతం ఈసినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది.ఇదిలా ఉంటే మహేష్ఈ సినిమా కోసం భారీ రిస్క్ చేస్తున్నట్లు తెలుస్తుంది.ఈ సినిమా కోసం మహేష్ బరువు పెరిగే పనిలో ఉన్నట్లు సమాచారం .ఈ సినిమాలో మహేష్ పాత్ర హనుమాన్ కి స్ఫూర్తిగా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.దీనితో మహేష్ ఎంతో బలంగా కనిపించాల్సి ఉంటుంది.అందుకే మహేష్ ఈ మూవీ కోసం బాగా కష్టపడుతున్నారు.ఈ సినిమాలో మహేష్ సిక్స్ ప్యాక్ లో కనిపించనున్నాడు.మహేష్ కోసం స్పెషల్ గా హాలీవుడ్ ట్రైనర్ ను కూడా పిలిపించినట్లు తెలుస్తుంది.ఈ సినిమాను మేకర్స్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

Show comments