Mahesh Devil Fan Made Posters Viral in Social media: సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం యానిమల్. రణబీర్ కపూర్ హీరోగా, రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 1న రిలీజ్ కానుంది. ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ షురూ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవల సందీప్ రెడ్డి వంగా ప్రమోషన్స్ లో భాగంగా.. మహేశ్ బాబుతో యానిమల్ సినిమా కాదు.. డెవిల్ అనే సినిమా చేయాల్సింది అని చెప్పుకువచ్చిన సంగతి తెలిసిందే. యానిమల్ కంటే ముందే డెవిల్ అనే స్క్రిప్టును మహేష్ బాబుకు చెప్పాను.. కానీ తెరకెక్కించడం కుదరలేదు అంటూ సందీప్ చెప్పుకువచ్చాడు. ఇక డెవిల్ సినిమా యానిమల్ కంటే వైయిలంట్ గా ఉంటుందని హైప్ ని ఇచ్చాడు సందీప్. ఇక ఇలా చెప్పాడో లేదో.. సోషల్ మీడియాలో ఈ విషయం వైరల్ గా మారింది. అంతే కాదు.. ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ పుట్టుకువస్తున్నాయి.
Mahesh Babu: పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టడం ఎలా… మగాళ్ళకి మహేష్ అదిరిపోయే టిప్
వైయిలెంట్ లుక్ లో మహేశ్ బాబు డెవిల్ పోస్టర్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. డెవిల్ సినిమా మహేశ్ చేసి ఉంటే బాగుండు అంటూ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. సందీప్ రెడ్డి వంగా యానిమల్ సినిమా చేస్తుండగా.. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ తో ఓ సినిమా, ప్రభాస్ తో ఓ సినిమా చేయనున్నాడు. ఈ సినిమా తర్వాతే మహేశ్ సినిమా ఉండోచ్చని తెలుస్తోంది. ఇక మహేశ్ విషయానికి వస్తే.. ప్రస్తుతం గుంటూరు కారం సినిమా చేస్తున్నాడు. ఇది అయిపోగానే.. రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఈ సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగాతో చేయనున్నాడని నెట్టింట వైరల్ గా మారింది. నిజంగానే మహేశ్ తో డెవిల్ సినిమా చేస్తే.. నెక్ట్స్ లెవెల్ అంటున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్. చూడాలి మరి ఏం జరగనుందో.