సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో వస్తోన్న పాన్-వరల్డ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ ‘వారణాసి’ ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో అంచనాలను పెంచేసింది. గ్లోబల్ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని, భారతీయ పురాణాలు, ఆధ్యాత్మిక అంశాలను అద్భుతమైన విజువల్స్‌తో రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మహేష్ సరసన గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటిస్తుండగా, మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా కనిపించనున్నారు. ఇక ఈ సినిమా విడుదల తేదీ ఖరారు కాకముందే, ప్రపంచవ్యాప్త ప్రమోషన్స్‌కు రాజమౌళి ఒక మెగా ప్లాన్ సిద్ధం చేసినట్లు సంచలన వార్తలు వస్తున్నాయి. ఆ వార్త ఏంటంటే,
Also Read : Va Vathiyar’: కార్తి ‘వా వాతియార్’ ట్రైలర్ ఔట్!
హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ రూపొందించిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘అవతార్ 3: ఫైర్ అండ్ యాష్’ డిసెంబర్ 19 విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. అయితే అవతార్3 థియేటర్ లో ‘వారణాసి’ టీజర్‌ను ప్రదర్శించబోతున్నారట. భారతదేశంతో పాటు ఎంపిక చేసిన కొన్ని దేశాలలో ‘అవతార్ 3’ ఇంటర్వెల్ సమయంలో ‘వారణాసి’ టీజర్ ప్రదర్శితం కానుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. రాజమౌళి, జేమ్స్ కామెరూన్ మధ్య ఉన్న స్నేహం, ‘RRR’ సినిమా చూసిన తర్వాత కామెరూన్ రాజమౌళిని ప్రశంసించడం వంటి అంశాల వల్లే ఈ అరుదైన డీల్ కుదిరినట్లు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ‘వారణాసి’ కథాంశం, విజువల్స్, మైథలాజికల్ మిస్టిసిజం ‘అవతార్’ సిరీస్ ప్రపంచానికి దగ్గరగా ఉండటం కూడా ఈ సంయుక్త ప్రమోషన్‌కు కారణంగా తెలుస్తోంది. ఈ డీల్ గనుక నిజమైతే, మహేష్ బాబు హాలీవుడ్ స్క్రీన్స్‌పై దర్శనమిచ్చి, గ్లోబల్ స్టార్‌గా ఎదగడానికి ఇది ఒక కీలక మలుపు అవుతుందని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భారీ అంచనాలు నెలకొన్న ఈ ప్రాజెక్ట్‌పై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది, దీని కోసం ప్రపంచ సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
