Site icon NTV Telugu

Guntur Karam : 2024లో ప్రపంచ వ్యాప్తంగా ఔరా అనిపించిన ‘కుర్చీ మడతపెట్టి’

Guntur Karam

Guntur Karam

Guntur Karam : ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన సినిమాల్లో మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా ఒకటి.. ప్రీమియర్ షోలతో ముందుగా మిక్స్డ్ టాక్ అందుకున్న ఈ .. ఆ తర్వాత మాత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద బాగానే కలెక్షన్స్ ను రాబట్టినట్లు తెలుస్తుంది. డైరెక్టర్ త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‏ లో మహేష్ కు జోడీగా శ్రీలీల, మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రలు పోషించగా.. రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, రావు రమేష్, జయరామ్ వంటి ప్రముఖ నటులు ప్రత్యేక పాత్రల్లో నటించారు.

Read Also:Jagtial Govt Hospital: ప్రభుత్వ ఆసుపత్రిలో అమానుషం.. వృద్ధ దంపతుల పట్ల సిబ్బంది నిర్లక్ష్యం..

అమ్మ సెంటిమెంట్ తో సినిమాను తెరాకెక్కించారు.. అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకుంది.. పాటల గురించి చెప్పక్కర్లేదు. తమన్ అందించిన మ్యూజిక్ శ్రోతలను ఆకట్టుకుంది. ఈ మూవీలోని ‘కుర్చీ మడతపెట్టి’ పాటకు వచ్చిన రెస్పాన్స్ గురించి చెప్పక్కర్లేదు. ముఖ్యంగా ఈ సినిమాలో కుర్చీ మడత పెట్టి సాంగ్ అయితే ఊహించని సెన్సేషన్ ని సెట్ చేసింది అని చెప్పాలి. మరి ఇది ఎంతవరకు వెళ్లిందంటే యూట్యూబ్ లో ఈ 2024 ఏడాదిలో గ్లోబల్ వైడ్ గా టాప్ లో వచ్చిన సాంగ్స్ లిస్ట్ లో నిలిచింది. అనేక దేశాల్లో టాప్ సాంగ్స్ తో పాటుగా మన దేశం నుంచి కుర్చీ మడతపెట్టి సాంగ్ ఒకటే నిలిచి సెన్సేషనల్ రికార్డు వ్యూస్ అందుకుంది. ఇలా మొత్తానికి ఈ సాంగ్ మాత్రం ఊహించని రికార్డు సెట్ చేసిందనే చెప్పొచ్చు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా హారికా హాసిని వారు నిర్మాణం వహించారు.

Read Also:DREAMCATCHER : గ్రాండ్ గా డ్రీమ్ క్యాచర్’ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్

Exit mobile version