Mahesh Babu: సినీ నటుడు సూపర్ స్టార్ కృష్ణ ఇటీవల కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన అస్థికలను కుమారుడు మహేష్ బాబు బెజవాడలోని కృష్ణా నదిలో నిమజ్జనం చేయనున్నారు. సోమవారం మధ్యాహ్నం కృష్ణా నదిలో అస్థికల నిమజ్జన కార్యక్రమం శాస్త్రోక్తంగా జరగనుంది. మహేష్ బాబు తన కుటుంబ సభ్యులు, సన్నిహితులతో ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి కార్లలో పోలీసు బందోబస్తు మధ్య విజయవాడకు బయలుదేరారు. అక్కడి నుంచి కృష్ణానది దుర్గా ఘాట్ కు చేరుకున్నారు. ఈ కార్యక్రమం అనంతరం వీరు తిరిగి హైదరాబాద్ కు బయల్దేరనున్నారు.
మహేశ్ బాబు రాక నేపథ్యంలో పోలీసులు భద్రతను ఏర్పాటు చేశారు. మహేష్ బాబు వెంట ఆయన బావలు సంజయ్ స్వరూప్, జయదేవ్, సుధీర్ బాబు, చిన్నాన్న ఆదిశేషగిరిరావు, దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, మెహర్ రమేష్, నిర్మాత సూర్యదేవర నాగవంశీ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమం అనంతరం వీరు తిరిగి హైదరాబాద్ కు బయల్దేరనున్నారు. మహేశ్ బాబు రాక నేపథ్యంలో పోలీసులు తగినంత భద్రతను ఏర్పాటు చేశారు. మహేష్ బాబు ఇంట్లో ఒకే ఏడాదిలో మూడు విషాదాలు నెలకొన్నాయి. జనవరిలో మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు అనారోగ్యంతో కన్నుమూశారు. చాలా కాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతోన్న రమేష్ బాబు.. జనవరి 8న మృతి చెందారు. ఇక మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి.. 70సంవత్సరాల వయసులో అనారోగ్యంతో సెప్టెంబర్ 28వ తారీఖున మరణించారు. తాజా తండ్రి కృష్ణ మృతితో మహేశ్ దు:ఖ సాగరంలో మునిగిపోయారు.
Mahesh Babu Reached Gannavaram Airport. pic.twitter.com/XsUzSew2Cx
— Naveen MB Vizag (@NaveenMBVizag) November 21, 2022