టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా దర్శక దిగ్గజం రాజమౌళి డైరెక్షన్ లో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. SSMB29 వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ చేస్తున్న ఈ సినిమా నుండి సినిమా నుంచి ఎలాంటి అఫీషియల్ అప్డేట్స్ రావడం లేదు. కొన్ని నెలల క్రితం ఈ సినిమా షూటింగ్ ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో చేసారు. ఆ టైమ్ లోనే ఈ సినిమాకు సంబందించి కొన్ని ఫోటోలు, వీడియోలు నెట్టింట లీక్ అయ్యాయి.
Also Read : Tollywood : మూడు సినిమాలే చేసినా.. టాప్ క్లాస్‌గా నిలిచిన ముగ్గురు డైరెక్టర్స్
అయితే ఈ సినిమాకు సంబందించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ ను నవంబర్ లో ఇస్తామని కొన్నాళ్ల క్రితం ప్రకటించారు. ఈ నేపథ్యంలో మంచి డేట్ కోసం చూస్తున్న మేకర్స్ రెండు, మూడు మంచి డేట్స్ చూసి పెట్టినట్టు టాక్ వినిపిస్తోంది. మహేష్ బాబు – రాజమౌళి చిత్రానికి సంబంధించి హైదరాబాద్ ఓ ఈవెంట్ లో ప్లాన్ చేస్తున్నారు. నవంబరు 11 లేదా 15న ఈ వేడుక జరిగే ఛాన్స్ వుంది. పబ్లిక్ ఈవెంట్ ఇది అభిమానులకు ఎంట్రీ ఉంటుందా లేదా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఈ ఈవెంట్ కోసం వెన్యూ కూడా ఫైనలైజ్ అవ్వాల్సివుంది. ఈ ఈవెంట్ లో టైటిల్ కూడా రివీల్ చేయాలనీ ఆలోచనలో మేకర్స్ ఉన్నారు. టైటిల్ కు సంభందించి ఓ గ్లింప్స్ కూడా రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. కాగా ఈ సినిమాకు ‘వారణాసి’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ ఈవెంట్ కు మహేశ్ బాబు, దర్శక ధీరుడు రాజమౌలి తో పాటు ప్రియాంక చోప్రా కూడా రాబోతున్నారు.
