ఒకప్పుడు సినిమాలను చూడటానికి సింగిల్ థియేటర్స్ వెళ్ళేవాళ్లు.. కానీ ఇప్పుడు అన్ని మల్టీప్లెక్స్ లుగా మారిపోతున్నాయి.. అక్కడ జనాలు ఎక్కువగా సినిమాలు చూడటం వల్ల సింగల్ థియేటర్ల వైపు వెళ్లడం జనాలు తగ్గించేశారు.. టికెట్ ధర ఎక్కువైన కూడా మల్టీప్లెక్స్ లలోనే సినిమాలను చూస్తున్నారు.. కొంతకాలం కింద మెయింటైన్ చేయలేక మూతపడిన సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అన్ని ఇప్పుడు మల్టీప్లెక్స్ లుగా మారిపోతున్నాయి..
హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డు లో ప్రతి శుక్రవారం పండగే. అక్కడ ఉన్న దేవి, సుదర్శన్, సంధ్య.. థియేటర్స్ ప్రతి శుక్రవారం బ్యానర్లు, పూల దండలు, హీరోల కటౌట్స్ తో నిండిపోతాయి. అభిమానులు అంతా అక్కడే తమ హీరోల సినిమాలని మొదటి రోజు చూడాలని ఆరాటపడతారు.. అలాంటి ఆ ఏరియాలో చాలా కాలంగా మూతబడిన ఓ థియేటర్ ను మహేష్ బాబు మల్టీప్లెక్స్గా మార్చబోతున్నారని సమాచారం…
సుదర్శన్ 35mm థియేటర్ వద్ద చేసే హంగామా అంతా ఇంతా కాదు. ప్రస్తుతం ఈ థియేటర్ బాగానే రన్ అవుతుంది. అయితే గతంలో సుదర్శన్ 70mm కూడా ఉండేదట.. 2010లోనే మూసేసారు. ఇప్పుడు ఆ థియేటర్ స్థలాన్ని లీజుకు తీసుకొని మహేష్ బాబు, ఏషియన్ సినిమాస్ కలిసి సంయుక్తంగా AMB క్లాసిక్ అనే పేరుతో 7 స్క్రీన్స్ ఉండే మల్టీప్లెక్స్ కట్టబోతున్నారని తెలుస్తుంది.. దీనిపై క్లారిటి రావాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చెయ్యాల్సిందే.. మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే.. రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు.. త్వరలోనే సినిమా సెట్స్ మీదకు వెళ్ళబోతుంది..