Site icon NTV Telugu

Nagabandham : సూపర్‌స్టార్ చేతుల మీదుగా ‘నాగబంధం’ టీజర్ రిలీజ్..

Nagabandham Movie Teaser

Nagabandham Movie Teaser

టాలీవుడ్‌లో ప్రస్తుతం ‘డివైన్ సినిమా’ల ట్రెండ్ నడుస్తోంది. ‘కార్తికేయ 2’, ‘హనుమాన్’ వంటి చిత్రాల వరుసలో ఇప్పుడు ‘నాగబంధం’ వచ్చి చేరింది. ‘పెదకాపు’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న విరాట్ కర్ణ హీరోగా, అభిషేక్ నామా ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. అయితే తాజాగా నేడు శివరాత్రి పర్వదినం సందర్భంగా ఆధ్యాత్మిక, ఫాంటసీ థ్రిల్లర్ ‘నాగబంధం’ టీజర్‌ను, సూపర్‌స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. టీజర్ చూశాక మహేష్ బాబు ప్రశంసల జల్లు కురిపించారు. విజువల్స్ చాలా బాగున్నాయని, ఈ సినిమా చూడటానికి తాను కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ఆయన పేర్కొన్నారు.

Also Read  :Supritha : మా కన్నీళ్లతో వ్యాపారం చేస్తున్నారు.. సుప్రీత ఎమోషనల్ కామెంట్స్!

నభా నటేష్, ఐశ్వర్యా మేనన్, జగపతి బాబు వంటి ప్రముఖ నటులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక పురాతన నిధులు, నాగబంధం సాంప్రదాయం, కొన్ని అంతుచిక్కని రహస్యాల నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతోంది. టీజర్‌లో చూపించిన గ్రాఫిక్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా రేంజ్‌ను తెలియజేస్తున్నాయి. దైవిక అంశాలతో కూడిన ఈ భారీ చిత్రాన్ని ఈ వేసవిలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నద్ధమవుతున్నారు.

 

Exit mobile version