సూపర్ స్టార్ మహేష్ బాబు రీసెంట్ గా గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా పర్వాలేదనే టాక్ ను అందుకున్నా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ ను అందుకుంది.. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో సినిమా చెయ్యబోతున్నాడు.. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ఎప్పుడో పూర్తి చేసుకుంది.. షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని మహేష్ ఫ్యాన్స్ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు..
తాజాగా మహేష్ బాబు స్టైలిష్ లుక్ లో ఆకట్టుకున్నాడు.. మహేష్ లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. లేటెస్ట్ లుక్‌లో ఆకట్టుకుంటున్నారు మహేష్.. రాజమౌళి సినిమా కోసం మహేష్ వర్కౌట్స్ చేస్తున్నారు.. అలాగే రాజమౌళి స్క్రిప్ట్ ఫైనల్ చేయడంతోపాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నారు. ఆర్టిస్టులను ఫైనల్ చేసే పనిలో ఉన్నారు.. ఇక రెండు మూడు నెలల్లో షూటింగ్ పనులు మొదలు కాబోతున్నాయని తెలుస్తుంది..
ఇంటర్నేషనల్ మూవీగా రాబోతున్న ఈ సినిమా కోసం మహేష్ బాబు తొమ్మిది రకాల గేటప్స్ ను ట్రై చేశారట.. భారీ అడ్వంచర్ కథతో రాబోతున్న ఈ సినిమా కోసం ఒక లుక్ ను ఫైనల్ చేశారట.. ఆ సినిమాను ఉగాది నుంచి మొదలు పెట్టబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.. ఇప్పటి వరకు ఎలాంటి అప్‌డేట్ లేదు. దీంతో ఓపెనింగ్ ఇప్పుడు ఉంటుందా లేదా అనేది సస్పెన్స్ గా మారింది. దాదాపు వెయ్యి కోట్లకు పైగా బడ్జెట్ తో సినిమాను తెరకెక్కిస్తున్నారని సమాచారం..
