భారత్-ఆస్ట్రేలియా మధ్య ఫిబ్రవరి 9న నుంచి ప్రారంభకానున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీపై అంచనాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ సిరీస్ కోసం అటు ఆటగాళ్లతో పాటు అభిమానులూ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సిరీస్ ఎవరు గెలుస్తారనే దానిపై బెట్టింగ్‌లు జోరందుకున్నాయి. పలువురు మాజీలు ఇదే విషయమై భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు ఆస్ట్రేలియాకు ఓటు వేస్తుంటే మరికొందరు మాత్రం ఇండియా టీమ్ వైపు నిల్చుంటున్నారు. ఈ నేపథ్యంలో శ్రీలంక మాజీ కెప్టెన్ మహేలా జయవర్ధనే ఈ సిరీస్ విజేత ఎవరనే దానిపై ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం టీమ్ పరంగా ఆసీస్ బలంగా ఉందని.. ఆ జట్టుకే గెలిచే అవకాశాలు ఎక్కువని తెలిపాడు.
Also Read: Anand Mahindra: సానియా మీర్జా నాకు స్ఫూర్తి: ఆనంద్ మహీంద్ర ట్వీట్ వైరల్
“ఆసీస్-భారత్ మధ్య బోర్డర్- గవస్కర్ ట్రోఫీ ఎప్పటికీ చారిత్రాత్మకంగానే ఉంటుంది. భారత పరిస్థితులను ఆస్ట్రేలియా బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తికరంగా మారింది. ఆసీస్‌కు మంచి బౌలింగ్ యూనిట్ ఉంది. ఆస్ట్రేలియా బౌలర్లను భారత బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారో వేచి చూడాలి. అయితే, తొలి టెస్టులో ఎవరు విజయం సాధిస్తారో వారికి ఒక మంచి ప్రారంభం దొరికినట్లవుతుంది. కానీ, ఎవరు విజేతగా నిలుస్తారనేది మాత్రం అంచనా వేయడం కష్టం. ఈ సిరీస్‌లో భారత్‌పై ఆస్ట్రేలియా అన్ని విధాలుగా పైచేయి సాధిస్తుందని భావిస్తున్నా. 2-1 తేడాతో సిరీస్‌ను ఆసీస్ కైవసం చేసుకుంటుంది. కానీ, ఆస్ట్రేలియాకు భారత్ గట్టి పోటీని ఇస్తుంది” అని జయవర్దనే పేర్కొన్నాడు.
Also Read: RC 15: హీరోయిన్ పెళ్లి కారణంగా షూటింగ్ క్యాన్సిల్…
తొలిసారి 1996-97లో జరిగిన బోర్డర్-గవస్కర్ ట్రోఫీని టీమిండియా కైవసం చేసుకుంది. అలాగే 2016-17, 2018 -2019, 2020 – 2021 సీజన్లలోనూ భారత జట్టే ట్రోఫీని గెలుచుకుంది. ఈసారి ట్రోఫీని కూడా సొంతం చేసుకుంటే.. నాలుగు టెస్టుల సిరీస్‌ను వరుసగా నాలుగో సారి కూడా సొంతం చేసుకొన్న జట్టుగా భారత్ అవతరిస్తుంది.