America : తల్లిదండ్రుల కష్టాలు చూసి చలించి బాగా చదివి వారి కళ్లలో పెట్టి చూసుకుందామనుకున్నాడు. ఉన్నత విద్య పూర్తి చేసి కుటుంబానికి అండగా నిలవాలని భావించాడు. ఈ క్రమంలోనే అమెరికాకు వెళ్లాడు. ఉన్నట్లుండి కారు యాక్సిడెంట్లో ప్రాణాలు పోగొట్టుకుని పేరెంట్లు ఆశల మీద ఆవిరి చల్లాడు. ఈ విషాద ఘటన మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కుటుంబంలో జరిగింది. మహేశ్ అనే విద్యార్థి అమెరికాలో రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఈ విషయం తెలియడంతో కుటుంబం మొత్తం ఒక్క సారిగా కుప్పకూలిపోయింది.
Read Also:CM KCR: నేడు సచివాలయంలో కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష.. పాల్గొననున్న కలెక్టర్లు, ఎస్పీ, సీపీలు
వివరాల్లోకి వెళితే.. బోయ మహేష్25) గతేడాది ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఆయన భూత్పూర్ మండలం కప్పెట గ్రామానికి చెందిన బోయ వెంకట్రాములు, శకుంతల దంపతుల పెద్ద కుమారుడు. వీరిది మధ్య తరగతి కుటుంబం. కుటుంబాన్ని పోషించేందుకు తండ్రి మహారాష్ట్రకు వెళ్లి, అక్కడే ఓ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నారు పేరెంట్స్ కష్టాలను చూసి పెరిగిన మహేష్ ఉన్నత విద్య పూర్తి చేసి కుటుంబానికి అండగా నిలుద్దామనుకున్నాడు. ఈ క్రమంలో బీటెక్ అయిపోగానే కిందటేడాది డిసెంబర్ 29న ఎంఎస్ చదివేందుకు అమెరికా వెళ్లాడు. అక్కడ మిన్నెసోటాలో ఉంటూ పీజీ చదువుతున్నాడు. అయితే మహేష్ తన ముగ్గురు ఫ్రెండ్స్తో కలిసి మంగళవారం అక్కడ కారులో ప్రయాణించాడు. ఆ కారు అదుపుతప్పి పల్టీ కొట్టింది. దీంతో అందులో ఉన్న మహేష్ తీవ్ర గాయాలతో చనిపోయాడు. ఆయన ముగ్గురు స్నేహితులకు గాయాలయ్యాయి.
Read Also:Narendra Modi: ప్రతిపక్షాల విమర్శలను మోడీ నిజం చేశారా.. తొమ్మిదేళ్లలో ఎన్ని దేశాలకు వెళ్లారు ?
మహేష్ స్నేహితులు తండ్రికి ఫోన్ చేసి అతడి మరణ వార్త తెలిపారు. ఈ విషయం తెలియడంతో ఆ కుటుంబం మొత్తం ఒక్క సారిగా షాక్ కు గురయ్యింది. కాగా.. మహేష్ మృతదేహాన్ని ఇండియాకు తీసుకొచ్చేందుకు స్థానిక ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. మృతదేహాన్ని త్వరగా ఇక్కడికి చేరవేయాలని ఆయన యూఎస్ లోని ఆటా సంస్థ ప్రతినిధులను ఆయన ఫోన్ ద్వారా కోరారు.