Site icon NTV Telugu

Mahavatar Narasimha : 98వ ఆస్కార్ రేసులో.. ‘మహావతార్ నరసింహా’..

Mahavathar Narshimha, Accar

Mahavathar Narshimha, Accar

భారత యానిమేషన్‌ రంగానికి.. మరో గర్వకారణంగా ‘మహావతార్ నరసింహా’ సినిమా నిలిచింది. తాజా సమాచారం ప్రకారం 98వ ఆస్కార్ నామినేషన్స్‌లో యానిమేషన్ కేటగిరీలో ఈ మూవీ చోటు దక్కించుకుంది. విడుదలైనప్పటి నుంచి ఈ చిత్రం ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను సంపాదించింది. పురాణ ఇతిహాసాలపై ప్రేక్షకుల ఆసక్తి ఎంత ఉందో, యానిమేషన్ రంగంలో ఇలాంటి ప్రయోగాలకు ఎంత అవకాశముందో ‘మహావతార్’ విజయమే నిరూపించింది. హిరణ్యకశ్యపుని సంహరించిన నరసింహ స్వామి కథతో పాటు, ప్రహ్లాదుని భక్తి, ప్రతి సన్నివేశం లో కనిపించిన డివోషనల్ వైబ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. మంచి సంగీతం, ఆకట్టుకునే సన్నివేశాలు కలిసి ఈ సినిమాకు భారీ హైప్‌ను తీసుకువచ్చాయి. ఈ విజయాన్ని చూసిన అనేక ప్రొడక్షన్ హౌస్‌లు యానిమేషన్ సినిమాల వైపు మళ్లడం కూడా జరిగింది.

Also Read : Meena : ఏ హీరో విడాకులు తీసుకున్న నాకే లింక్ చేస్తున్నారు – మీనా ఫైర్

హోంబలే ప్రొడక్షన్స్ సుమారు 30 కోట్లతో నిర్మించిన ఈ చిత్రాన్ని దర్శకుడు అశ్విన్ కుమార్ ఎంతో నిబద్ధతతో తెరకెక్కించారు. అలా థియేట్రికల్ రన్‌లో 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, ఇప్పటికే రికార్డులు.. రివార్డులు అందుకున్న ‘మహావతార్’ ఇప్పుడు ఆస్కార్ నామినేషన్‌తో మరోసారి తన రేంజ్‌ను నిరూపించింది. అయితే పోటీలో ‘పాప్ డీమన్ హంటర్స్’, ‘ఇన్ఫినిటీ కాస్టెల్’, ‘డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా’ వంటి హాలీవుడ్ యానిమేషన్ దిగ్గజాలు కూడా ఉన్నాయి. విజువల్ క్వాలిటీ, నిర్మాణ విలువల్లో కొన్ని ఫ్రేములు హాలీవుడ్ రేంజ్‌ను తలపించినా, తుది ఫలితం ఎలా వస్తుందొ చూడాలి. ఆస్కార్ దక్కుతుందా లేదా అన్నది పక్కన పెడితే, యానిమేషన్ రంగానికి ‘మహావతార్ నరసింహా’ ఇచ్చిన గుర్తింపు మాత్రం ఇండియాలో మరిన్ని భారీ యానిమేషన్ ప్రాజెక్టులకు దారితీస్తుందనే చెప్పాలి.

Exit mobile version