NTV Telugu Site icon

Mahathi Swara Sagar : రాంచరణ్ తో తప్పకుండా ఆ పాటను రీమేక్ చేస్తాను..

Whatsapp Image 2023 08 01 At 9.07.29 Pm

Whatsapp Image 2023 08 01 At 9.07.29 Pm

తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ గా ఎదిగిన చిరంజీవి ఎంతో మంది యువ హీరోలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి యువ హీరోలకు పోటీగా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.. ఈ ఏడాది ఆరంభం లో వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నారు.మెగాస్టార్ చిరంజీవి నటించిన తరువాత సినిమా భోళా శంకర్ ఆగస్టు 11వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ సినిమా త్వరలోనే విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిత్ర యూనిట్  వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ ఈ సినిమాకు సంగీతం అందించిన విషయం తెలిసిందే.. ఈ సందర్భంగా ఈయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొని భోళా శంకర్ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలియజేశారు.

అలాగే మెగాస్టార్ చిరంజీవి గారితో సినిమా చేయడం గురించి తన అనుభవాలను కూడా తెలియజేశారు. అదేవిధంగా తన తండ్రి మణిశర్మ చిరంజీవి కాంబినేషన్లో వచ్చిన సినిమాల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.తన తండ్రి మణిశర్మ గారి సంగీత సారధ్యంలో చిరంజీవి నటించిన సినిమాలలో తనకు ఇంద్ర,మృగరాజు సినిమాలు అంటే చాలా ఇష్టం అని ఆయన తెలిపారు.ఇంద్ర సినిమాని నేను దాదాపు  500 సార్లు చూసి ఉంటానని తెలిపారు.ఇంద్ర సినిమా తర్వాత మృగరాజు సినిమా అంటే ఎంతో ఇష్టమని ఆయన తెలిపారు. ఇక ఈ సినిమాలలో కనుక ఏదైనా పాటను నేను రీమిక్స్ చేయాల్సి వస్తే కనుక “రాదే గోవిందా”అనే పాటను తప్పనిసరిగా రీమిక్స్ చేస్తానని అది కూడా మెగా పవర్ స్టార్ రాంచరణ్ గారితో మాత్రమే ఈ పాట ను రీమిక్స్ చేస్తాను అంటూ ఈ సందర్భంగా మహతి స్వర సాగర్ తెలియజేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి..