NTV Telugu Site icon

Viral Video : ఓర్నీ.. దేవుడు సామి నువ్వు.. బస్సు డ్రైవర్ చేసిన పనికి నెటిజన్స్ షాక్..

Madyapradesh

Madyapradesh

ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తుండటం నిత్యం మనం చూస్తూనే ఉన్నాం.. ఇక తింటున్న వాళ్లను కూడా చూసే ఉంటాం.. సిగరెట్ తాగుతూ నడిపే డ్రైవర్‌ను కూడా చూశాం. కానీ ఓ బస్సు డ్రైవర్ మాత్రం గొడుగు పట్టుకుని డ్రైవింగ్ చేస్తున్నాడు. ఒక చేత్తో గొడుగును పట్టుకుని మరో చేత్తో బస్సు స్టీరింగ్‌ను కంట్రోల్ చేస్తూ దూసుకెళ్తున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాల్లో వైరల్‌గా మారింది.. అస్సలు ఆ డ్రైవర్ గొడుగును అలా ఎందుకు పట్టుకున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం..

ఆర్టీసీ బస్సు అంటే నిత్యం సామాన్య ప్రజలను గమ్యస్థానాలకు చేర్చే వాహనం. స్కూలు, కాలేజీ స్టూడెంట్స్‌తోపాటు చాలా మంది చిరు వ్యాపారులు, ఉద్యోగులు.. ప్రైవేటు వాహనాల్లో ఎక్కువ డబ్బులు పెట్టి ప్రయాణించకుండా ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆర్టీసీల్లోనే ప్రయాణం చేస్తారు. అయితే చాలా ఆర్టీసీ బస్సుల్లో సరైన సౌకర్యాలు ఉండవు. విపరీతమైన శబ్దం, చిరిగిపోయిన సీట్లు, పగిలిపోయిన అద్దాలు, శుభ్రంగా లేకుండా ఉంటాయి… తాజాగా డ్రైవర్ గొడుగు పట్టుకొని డ్రైవింగ్ చెయ్యడం పై విమర్శలు ఎదురవుతున్నాయి..

అందుకు పెద్ద కారణమే ఉంది.. డ్రైవర్ కూర్చున్న సీటు పై బొక్కలు పడ్డాయి.. బయట వర్షం పడుతుండగా లోపల డ్రైవర్ పై పడుతుంటే అతను గొడుగు పట్టుకున్నాడు.. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది. గడ్చిరోలి జిల్లాలో భారీగా వర్షం పడుతుండంతో ఆ రంధ్రంలో నుంచి వాన నీరు వచ్చి.. డ్రైవర్‌పై పడుతోంది. దీంతో బస్సును ఆపలేక అదే నీటిలో తడవ లేక డ్రైవర్ అవస్థలు పడ్డాడు. అప్పుడే ఆ డ్రైవర్‌కు ఒక ఉపాయం వచ్చింది. వెంటనే గొడుగు తీసుకుని ఒక చేత్తో పట్టుకున్నాడు. మరో చేతితో స్టీరింగ్ కంట్రోల్ చేసుకుంటూ వెళ్లాడు.. ఈ దృశ్యాన్ని చూసిన ప్రయాణికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.. దాంతో వీడియో వైరల్ అవుతుంది.. ఇది పాతదే అయిన ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.. ఇక ప్రతి రాష్ట్రంలో ఉన్నాయానుకోండి.. ఓ లుక్ వేసుకోండి..