Site icon NTV Telugu

Physical Harassment: బాలికకు అశ్లీల చిత్రాలు చూపించి.. లైంగిక వేధింపులకు పాల్పడ్డ స్కూల్ స్పీపర్

Maharastra Student

Maharastra Student

రోజు రోజుకు కామాంధులు రెచ్చిపోతున్నారు. అమాయక బాలికలపై అత్యాచారానికి పాల్పడుతున్నారు. యువత నుంచి మొదలు పెడితే, వృద్ధుల వరకూ మృగాళ్లు కామంతో రగిలిపోతున్నారు. తాజాగా.. ఓ విద్యార్థినికి అశ్లీల చిత్రాలు చూపించి, లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు స్కూల్ స్వీపర్. ఈ ఘటన మహారాష్ట్రలోని నందుర్‌బార్ జిల్లాలోని ఓ పాఠశాలలో జరిగింది. ఈ క్రమంలో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

Read Also: Ajith : అంత స్పీడ్ ఏంటి సార్.. వామ్మో??

కాగా.. ఈ ఘటనపై విద్యార్థిని తన తల్లిదండ్రులకు చెప్పగా విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే.. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో.. నిందితుడిపై భారతీయ న్యాయ సంహిత (బిఎన్ఎస్) మరియు పోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద అరెస్టు చేశారు. నిందితుడు పాఠశాలలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసే వాడిగా గుర్తించారు. అనంతరం.. పాఠశాలలో ఉన్న సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా.. నిందితుడు తన ఫోన్‌ను విద్యార్థినికి అందజేస్తున్నట్లు కనిపించింది. ఈ క్రమంలో.. పాఠశాల యాజమాన్యం అతనిని పాఠశాల నుంచి తొలగించింది.

Read Also: Reliance AGM 2024: ముఖేష్ అంబానీ భారీ ప్రకటన.. ఇక నుంచి ఒక్కరూపాయికే….?

ఈ సంఘటన గురించి నందుర్‌బార్ ఎస్పీ మాట్లాడుతూ.. ఆగస్టు 27న నందుర్‌బార్‌లోని ఒక పాఠశాలలో ఈ సంఘటన జరిగింది. పాఠశాలలో పనిచేస్తున్న ఒక వ్యక్తి మైనర్ పాఠశాల విద్యార్థికి తన ఫోన్‌లో అశ్లీల కంటెంట్‌ను చూపించాడు. ఈ క్రమంలో.. ఈ రోజు బాలిక కుటుంబసభ్యులు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని అతనిపై ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. దీంతో.. అతనిపై కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశామన్నారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని.. నిందితుడిపై చార్జిషీట్‌ను వీలైనంత త్వరగా దాఖలు చేసేందుకు పోలీసులు సన్నాహాలు చేస్తున్నారని ఎస్పీ తెలిపారు.

Exit mobile version