NTV Telugu Site icon

Maharastra : అమరావతి జైలులో పేలుడు.. భయాందోళనలో తొక్కిసలాట

New Project (97)

New Project (97)

Maharastra : మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలోని జైలులో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటన శనివారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో జరిగింది. పేలుడు శబ్ధంతో జైలు సముదాయం అంతా భయాందోళనకు గురవుతోంది. ఈ పేలుడు జైలులోని ఆరు, ఏడు నంబర్ల బ్యారక్ మధ్య జరిగింది. ఈ పేలుడు కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకపోవడం విశేషం. పోలీసు వర్గాల ప్రకారం.. ఈ పేలుడు ఒక చిన్న, స్వదేశీ బాంబు కారణంగా సంభవించింది. అయితే ఈ పేలుళ్లకు ఎవరు పాల్పడ్డారు, ఎందుకు చేశారన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు.

Read Also:Kalki2898AD Records: సౌత్ ఇండియా హీరోలలో ‘ఒకే ఒక్కడు’ ప్రభాస్!

జైలు యాజమాన్యం నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం పోలీసు కమిషనర్ స్వయంగా బాంబు డిస్పోజల్ స్క్వాడ్‌తో వచ్చి ఘటనపై విచారణ చేపట్టారు. జైలులో ఆరు, ఏడు నంబర్ల బ్యారక్ దగ్గర బాంబు లేదా పటాకులు పేలుతున్నట్లు పెద్ద శబ్దం ఉందని అతను చెప్పాడు. దీంతో జైలులో తొక్కిసలాట జరిగింది. అయితే పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. ఇప్పటి వరకు ఎలాంటి అనుమానాస్పద వస్తువు కనిపించలేదు.

Read Also:Chalasani Srinivas: గుజరాత్ పాలకుల కాళ్ళ కింద తెలుగు రాష్ట్రాలు ఉండాలా

ఫోరెన్సిక్ బృందం తనిఖీలు
పోలీసు కమీషనర్ తెలిపిన వివరాల ప్రకారం, బాంబు డిస్పోజల్ స్క్వాడ్, ఫోరెన్సిక్ బృందాన్ని సంఘటనా స్థలానికి రప్పించారు. ఈ బృందాలు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాయి. ఘటనా స్థలం నుంచి పటాకుల నమూనాలను సేకరించడంతో పాటు ఇతర ఆధారాలను కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు. ఫోరెన్సిక్ బృందం సంఘటన స్థలం చుట్టూ కనిపించే అన్ని రకాల వేలిముద్రలను సేకరిస్తోంది. ఈ వేలిముద్రలను జైలులో నివసిస్తున్న ఖైదీల వేలిముద్రలతో సరిపోల్చనున్నారు. పేలుడు జైలు లోపల ఉంటున్న ఖైదీ వల్ల జరిగి ఉండవచ్చు. దీన్ని ఏదో గ్యాంగ్ వార్‌తో అనుసంధానం చేసేందుకు కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జైలులో ఉన్న వివిధ ముఠాల నేరస్తుల జాతకాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బాంబ్ స్క్వాడ్ తీసిన శాంపిల్ చూస్తే.. ఈ బాంబును జైల్లోనే తయారు చేసి ఎవరినో భయపెట్టేందుకు ఉపయోగించినట్లు తెలుస్తోంది. అయితే, పోలీసులకు ఇంతవరకు సరైన ఆధారాలు లభించలేదు.