Site icon NTV Telugu

Maharashtra: తన కళ్ల ముందే పంట నాశనమవడం చూసిన రైతు ఏం చేశాడో చూడండి (వీడియో)

Virally

Virally

ఆరుగాలం కష్టపడి పండిస్తున్న రైతన్నకు నష్టాలే మిగులుతున్నా యి. ఓ వైపు ప్రభుత్వ నిర్లక్ష్యం.. మరోవైపు అకాల వర్షాలతో కన్నీళ్లే మిగులుతున్నాయి. దేశాన్ని ఎప్పుడూ ఆకలితో పడుకోనివ్వని రైతు ప్రకృతి ముందు కూడా నిస్సహాయుడవుతున్నాడు. చలి, వేడి, ఎండ, వానలను భరించి తాను పండించిన పంటను మార్కెట్‌కు తరలిస్తే అక్కడ కూడా పంటకు రక్షణ లేకుండా పోతోంది. అకాల వర్షాల వల్ల వారి పంటలు కొట్టుకుపోతే.. ఆ అన్నదాత ఎంత ఆవేదనకు గురవుతాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా ఇలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

READ MORE: IND A Squad Announced: ఇంగ్లాండ్ టూర్ కోసం ఇండియా-ఎ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?

మహారాష్ట్రలో వాషిమ్ అనే జిల్లాలో రైతులు తమ వేరుశనగ పంటను అమ్ముతుంటారు. అలాగే ఓ రైతు కూడా తన పంటను విక్రయించడానికి మార్కెట్‌కి వచ్చాడు. కానీ అకస్మాత్తుగా భారీ వర్షం మొదలైంది. నేలపై పారబోసిన పంట ఒక్కసారిగా వరద నీటికి కొట్టుకుపోతోంది. తన కళ్ల ముందే పంట నాశనమవడం చూసిన ఆ రైతు తీవ్ర దిగ్భ్రాంతి చెందాడు. జోరుగా కురుస్తున్న వర్షంలో తడుస్తూ.. వర్షపు నీటికి కష్టపడి పండించిన పంటల కొట్టుకుపోతుంటే.. దాన్ని కాపాడుకునేందు ప్రయత్నిస్తున్నాడు. తన పంట కొట్టుకుపోతుండటం చూసి రైతు నిస్సహాయంగా వర్షంలో నేలపై కూర్చుని ఒక సంచితో ఆపడానికి ప్రయత్నిస్తాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 39 సెకన్ల ఈ చిన్న క్లిప్ చూసిన జనాలు అయ్యో పాపం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆకస్మిక వర్షాల కారణంగా రైతులు భారీగా నష్టపోతున్నారని ఈ వీడియో ద్వారా మరోసారి స్పష్టమవుతోంది. ప్రభుత్వం స్పందించి ఆ అన్నదాతలను ఆదుకోవాల్సి అవసరం ఎంతైనా ఉంది.

READ MORE: Hair Loss Causes: వంశపారపర్యంగా బట్టతల వస్తుందా? నివేదికలు ఏం చెబుతున్నాయ్?

Exit mobile version