Site icon NTV Telugu

Maharashtra: దారుణం.. రూ.66 వేల పెట్టుబడితో 7.5 క్వింటాళ్ల ఉల్లి సాగు.. రాబడి రూ. 664..!

Amh

Amh

Maharashtra: ఆరుగాలం శ్రమించినా పంట దిగుబడి ఆశించిన స్థాయిలో రాకపోతే అన్నదాత కళ్లలో ఆనందం ఉండదు. కొన్నిసార్లు పురుగు మందుల నుంచి కూలీల వరకు ఖర్చు చేసినా డబ్బు వెళ్లని పరిస్థితులుంటాయి. అప్పులు తెచ్చి వాటిని తీర్చలేని పరిస్థితి నెలకొంటుంది. తాజాగా ఉల్లిగడ్డ సాగు చేసిన రైతుకు ఇదే పరిస్థితి నెలకొంది. అహోరాత్రులు కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకపోగా, కనీసం రవాణా ఖర్చులు కూడా మిగలని దయనీయ పరిస్థితి దాపురించింది. అసలు ఏం జరిగిందంటే..?

READ MORE: Toll Plaza: దీపావళి బోనస్ ఇవ్వలేదని ఉద్యోగుల నిరసన.. ఫ్రీగా టోల్‌ గేట్లు ఎత్తివేత

మహారాష్ట్రలోని పూణే సమీపంలోని పురందర్‌కు చెందిన సుదామ్ ఇంగ్లే ఓ రైతు. ఆయనకు ఉన్న పొలంలో ఉల్లి సాగు చేశారు. పెట్టుబడి కింద రూ.66,000 ఖర్చు చేశారు. అంతా బాగానే ఉంది. సడెన్‌గా ఇటీవల భారీ వర్షాలు కురిశాయి. దీంతో సీన్ ఒక్కసారిగా మారిపోయింది. ఉల్లిపాయలు తడిసి పోయాయి. అందులో కొన్ని పాడయ్యాయి. ఏదైతే అదైతది ఎలాగో కష్టపడి సాగు చేశాం.. మార్కెట్‌కి తరలించి విక్రయిద్దామాని ఫిక్స్ అయ్యాడు. రూ. 1500 ఖర్చు చేసి బస్తాలను పురందర్ మార్కెట్‌కు తరలించారు. అక్కడ ధరలు చూసి అవాక్కయ్యాడు. పురందర్ మార్కెట్ యార్డులో 7.5 క్వింటాళ్ల ఉల్లిని అమ్మితే ఆయన చేతికి వచ్చింది కేవలం రూ.664 మాత్రమే. రూ. 66 వేలు ఖర్చు చేసి పంట పండిస్తే కనీసం ఒక్క వెయ్యి రూపాయాలు కూడా రాకపోవడంతో ఆ రైతు ఆవేదనకు మాటల్లేవు.

READ MORE: Blue Snake: నీలం రంగు పామును మీరెప్పుడైనా చూశారా..? చూడకపోతే ఇప్పుడే చూడండి..

ఈ అంశంపై సుదామ్ ఇంగ్లే స్పందించారు. ఇది కేవలం ఒక ఎకరం భూమి నుంచి వచ్చిన పంట అని తెలిపారు. మరో ఒకటిన్నర ఎకరాల్లో ఉన్న ఉల్లిని అమ్మి లాభం లేదని.. దానిపై రోటవేటర్ వేసి పొలానికి ఎరువుగా మార్చేస్తానన్నారు. అమ్మడం కంటే అదే మేలలని ఆవేదన వ్యక్తం చేశారు. తన లాంటి పెద్ద రైతుల పరిస్థితే ఇలా ఉంటే.. అప్పులు చేసి ఒకటి రెండు ఎకరాల్లో సాగు చేసే చిన్న రైతులు ఎలా బతకాలి? అని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతాయని స్పష్టం చేశారు. కాగా.. ఇది కేవలం ఇంగ్లే కథ మాత్రమే కాదు.. మహారాష్ట్రలోని వ్యవసాయం చేస్తున్న అనేక మంది రైతుల కథ. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ధరలు పడిపోవడం వల్ల రైతులు మనుగడ ఇబ్బందిగా మారుతోంది. ఉల్లిపాయలు, టమోటాలు, బంగాళాదుంపల నుంచి దానిమ్మ, సీతాఫలం, సోయాబీన్ వరకు దాదాపు ప్రతి పంట ఈ సీజన్‌లో దెబ్బతిన్నాయి. నష్టాన్ని చవిచూస్తున్న రైతులు ఉరికంబానికి వేలాకంటే ముందే ప్రభుత్వం స్పందించి రైతలకు గిట్టుబాటు ధర కల్పించాలి..

Exit mobile version