Site icon NTV Telugu

Maharashtra: రైల్వే స్టేషన్ల పేర్ల మార్పునకు షిండే సర్కార్ నిర్ణయం

Maha Cm

Maha Cm

సార్వత్రిక ఎన్నికల వేళ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు ఓ వైపు తాయిలాలు ప్రకటిస్తూనే.. మరో వైపు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడి మరీ నిర్ణయాలు తీసుకుంటున్నాయి.

ఇటీవలే మారాఠా రిజర్వేషన్‌ బిల్లుకు మహారాష్ట్ర అసెంబ్లీలో ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అలాగే ప్రభుత్వ పత్రాల్లో తల్లి పేరు ఉండేలా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. తాజాగా ముంబైలో ఎనిమిది రైల్వే స్టేషన్ల పేర్లు మార్చాలని షిండే మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. బ్రిటీషు కాలం నాటి పేర్లు మార్చేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అలాగే ఒక జిల్లా పేరుతో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

అహ్మద్‌నగర్ జిల్లా పేరును అహల్యా నగర్‌గా మార్చాలని మహారాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. అలాగే ఉత్తాన్ (భయందర్) మరియు విరార్ (పాల్ఘర్) మధ్య సముద్ర మార్గాన్ని నిర్మించడానికి కేబినెట్ ఆమోదించింది.

ఇక శ్రీనగర్, జమ్మూకాశ్మీర్‌లో మహారాష్ట్ర భవన్ నిర్మించడానికి 2.5 ఎకరాల భూమిని కొనుగోలు చేయాలని షిండే మంత్రివర్గం ఆమోదించింది. దీనికి సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదన ఇప్పటికే మహారాష్ట్ర అసెంబ్లీలో గత బడ్జెట్ సెషన్‌లో పొందుపరిచింది.

ఎనిమిది ముంబై సబర్బన్ రైల్వే స్టేషన్ల పేర్లను మార్చనున్నారు. ప్రతిపాదిత పేర్లలో సర్ జగన్నాథ్ శంకర్ సేథ్, ముంబాదేవి, గిర్గావ్, లాల్‌బాగ్, డోంగ్రీ, కాలా చౌకీ, మజ్‌గావ్, తీర్థంకర్ పార్శ్వనాథ్ ఉన్నాయి.

ముంబై సెంట్రల్ అనే పేరు.. వాస్తవానికి బాంబే సెంట్రల్. 1930లో స్టేషన్‌ను నిర్మించినప్పుడు ఇది నగరానికి కేంద్ర రవాణా కేంద్రంగా పనిచేయాలని ఉద్దేశించబడింది. దీనికి ప్రతిపాదిత పేరు: సర్ జగన్నాథ్ శంకర్ సేథ్

 

 

Exit mobile version