Maharashtra: మహారాష్ట్రలోని బీడ్ జిల్లా మజల్గావ్‌లో జరిగిన “ఐ లవ్ మొహమ్మద్” కార్యక్రమంలో ఒక మతాధికారి చేసిన ప్రకటన పెద్ద వివాదానికి దారితీసింది. బహిరంగ వేదిక నుంచి మతాధికారి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను బహిరంగంగా సవాలు చేశారు. మజల్గావ్‌కు వస్తే.. సీఎం యోగిని అక్కడే ఖననం చేస్తానని హెచ్చరించాడు. ఈ ప్రకటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
READ MORE: Acerpure Nitro Gaming TV: బడ్జెట్ ధరలో.. ఏసర్ నుంచి అధునాతన ఫీచర్లతో గేమింగ్ స్మార్ట్ టీవీ విడుదల..
నిజానికి.. “ఐ లవ్ మొహమ్మద్” కార్యక్రమంలో ఆ మతాధికారి మాట్లాడుతూ.. “ముస్తఫా మసీదు ముందు, మజల్గావ్ నగరం నుంచి సీఎం యోగిని నేను సవాలు చేస్తున్నాను. మజల్గావ్‌లో “ఐ లవ్” బ్యానర్ పెట్టిన వారిని అరెస్టు చేస్తే.. మిమ్మల్ని ఇక్కడే ఖననం చేస్తానని నేను దేవుడిపై ప్రమాణం చేస్తున్నాను” అని సీఎం యోగీని ఉద్దేశించి సవాల్ విసిరారు. అతను యోగి ఆదిత్యనాథ్‌పై దుర్భాషలాడుతూ మరింత రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశాడు. ఈ ప్రకటన ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది. అయితే.. ఈ ప్రకటన చేసిన మతాధికారి ఎవరో ఇంకా వెల్లడి కాలేదు. స్థానిక మజల్గావ్ పోలీస్ స్టేషన్‌లో అతడిపై ఎఫ్‌ఐఆర్ నమోదు కాలేదు. కానీ వైరల్ అయిన వీడియో మాత్రం వేగంగా వైరల్ అవుతోంది. పోలీసు యంత్రాంగం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో, యోగి ఆదిత్యనాథ్‌ను నేరుగా లక్ష్యంగా చేసుకోవడం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.
READ MORE: Acerpure Nitro Gaming TV: బడ్జెట్ ధరలో.. ఏసర్ నుంచి అధునాతన ఫీచర్లతో గేమింగ్ స్మార్ట్ టీవీ విడుదల..
