Site icon NTV Telugu

Maharani Season 3 : ఆసక్తి రేకెత్తిస్తున్న మహారాణి సీజన్ 3 టీజర్..

Whatsapp Image 2024 01 16 At 8.38.59 Pm

Whatsapp Image 2024 01 16 At 8.38.59 Pm

హుమా ఖురేషీ లీడ్ రోల్లో నటించిన మహారాణి వెబ్ సిరీస్ తొలి రెండు సీజన్లు ఎంతో ఆకట్టుకునేలా ఉన్నాయి. రాణీ భారతి పాత్రలో హుమా ఎంతో పవర్‌ఫుల్ గా కనిపించింది.ఇప్పుడు మహారాణి వెబ్ సిరీస్ మూడో సీజన్ రాబోతుంది.. తాజాగా మంగళవారం (జనవరి 16) ఈ కొత్త సీజన్ టీజర్ రిలీజైంది.మహారాణి వెబ్ సిరీస్ మూడో సీజన్ టీజర్ ఎంతో ఆసక్తికరంగా ఉంది. నాలుగో తరగతి పాస్ కాకుండానే రాష్ట్రాన్ని ఏలిన రాణి భారతి.. తాజాగా రానున్న సీజన్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినట్లు టీజర్లో చూపించారు. తనకు చదువు రానప్పుడే మిమ్మల్ని ఆ స్థాయిలో టార్చర్ పెడితే.. ఇప్పుడు డిగ్రీ పాసైన తర్వాత ఇంకెలా ఉంటుందో ఊహించుకోండి అనే పవర్ ఫుల్ డైలాగ్ తో హుమా ఈ టీజర్లో ఎంట్రీ ఇచ్చింది.మహారాణి వెబ్ సిరీస్ మూడో సీజన్ త్వరలోనే స్ట్రీమింగ్ కానున్నట్లు సోనీలివ్ వెల్లడించింది. చేతులకు బేడీలతో ఉన్న రాణి భారతి ఎంట్రీ కొత్త సీజన్ పై మరింతగా అంచనాలను పెంచేసింది. జైల్లో స్వీట్లు పంచుతున్న సీన్ తో ఈ టీజర్ మొదలవుతుంది.

రాణి భారతి ఇంటర్మీడియట్ పాసైన సందర్భంగా స్వీట్లు పంచుతున్నట్లు చెబుతారు.”పరీక్ష కోసం సంసిద్ధత కొనసాగుతోంది. మహారాణి మళ్లీ వస్తోంది” అనే క్యాప్షన్ తో ఈ టీజర్ ను సోనీ లివ్ షేర్ చేసింది. ఈ టీజర్ చూసిన ఫ్యాన్స్.. కొత్త సీజన్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నట్లు కామెంట్స్ చేశారు.1990లనాటి బీహార్‌ రాజకీయాల ఆధారంగా ఈ సిరీస్‌ సాగుతుంది. నిజానికి వాస్తవ ఘటనల ఆధారంగానే ఈ సిరీస్‌ తెరకెక్కించినా.. వాటికి తమదైన ట్విస్టులు, డ్రామాను జోడించి మేకర్స్‌ మరింత ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కించారు..తొలి సీజన్లో సీఎంగా ఉన్న తన భర్తపై హత్యా ప్రయత్నం జరగడంతో ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన రాణి భారతి.. రెండో సీజన్లో మరింత పవర్‌ఫుల్ గా మారుతుంది. జైలు నుంచి బయటకు వచ్చిన భీమా భారతి మళ్లీ సీఎం పదవిని దక్కించుకోవడం కోసం చేసే ప్రయత్నాలు.. వాటికి చెక్‌ పెట్టడానికి అప్పటికే పాలిటిక్స్‌లో ఆరితేరిన రాణి భారతి వేసే ఎత్తులు ఇలా ప్రతి ఎపిసోడ్‌ ఎంతో ఆసక్తికరంగా సాగుతుంది. మరి తాజాగా రిలీజ్ కాబోతున్న సీజన్ ఎలా ఉంటుందో చూడాలి.

Exit mobile version