Maharaja : చైనా బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్న మహారాజా
- చైనాలో రికార్డులు సృష్టిస్తోన్న విజయ్ మహారాజ
- 40వేల స్క్రీన్లలో ప్రదర్శితమవుతున్న సినిమా
- రూ.40కోట్లు కొల్లగొట్టి రికార్డు నమోదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharaja : కోలీవుడ్ విలక్షణ నటుడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా నటించిన చిత్రం “మహారాజ”. యువ దర్శకుడు నితిలాన్ స్వామినాథన్ దర్శకత్వం వహించాడు. ఎలాంటి అంచనాలు, పెద్దగా ప్రమోషన్స్ లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని విడుదలైన అన్నీ చోట్ల మంచి వసూళ్లను సాధించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఊహించని విజయం సాధించి రూ.100 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టింది.
Read Also:Syria: సిరియాలో మారణహోమం!.. అక్కడి నుంచి వచ్చేయాలని భారతీయులకు కేంద్రం అడ్వైజరీ
Also Read
- Kangana Ranaut: త్రిషపై ఉదయనిధి వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఏమన్నారంటే..!
- Bihar Politics: బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ విజయం.. బీజేపీకి కాదు, అసలు తలనొప్పి ఆర్జేడీకే..
- Minister Narayana: సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు.. అమరావతికి కొత్త ఊపు
- Udhayanidhi Stalin: ఉదయనిధి స్టాలిన్ విడుదల.. కార్యకర్తలు సంబరాలు
కాగా ఈ సినిమాను 20 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కించారు నిర్మాతలు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చిత్ర హీరో విజయ్ సేతుపతి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఈ చిత్రంలో నటించాడట. సినిమా విడుదలయ్యాక లాభాల్లో వాటా తీసుకోమని కోరగా ఆయన అంగీకరించి ఫ్రీగా ఈ చిత్రంలో నటించారని సమాచారం. విడుదల నాటి నుండి సూపర్ హిట్ తో దూసుకు వెళ్లింది ఈ సినిమా. జూన్ 14న విడుదలైన ఈ సినిమా 50 రోజులు విజయవంతంగా ఆడింది. ఇటు తెలుగులోను మహారాజా సూపర్ హిట్ సాధించింది. రెండు తెలుగు రాష్ట్రాలలో మహారాజా 20కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టింది.
Read Also:CM Chandrababu : నేడు బాపట్లలో సీఎం చంద్రబాబు పర్యటన…
మహారాజ సినిమా విజయ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అయ్యిన సంగతి తెలిసిందే. ఇపుడు ఈ సినిమా ఇంట్రెస్టింగ్ గా చైనాలో థియేట్రికల్ రిలీజ్ అయింది. అక్కడ నవంబర్ 29న రిలీజ్ అయి మంచి కలెక్షన్లను సాధిస్తోంది. అక్కడ ఏకంగా 40వేల స్క్రీన్స్ లో విడుదల చేయగా ఇపుడు ఈ సినిమాకు అక్కడ మంచి ఓపెనింగ్స్ దక్కినట్లు మేకర్స్ చెబుతున్నారు. దాంతో పాటు ఈ సినిమా ఇప్పటికే అక్కడ బాక్సాపీస్ వద్ద 40 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. మొత్తంగా ఇప్పటి వరకూ ప్రపంచవ్యాప్తంగా రూ.149 కోట్లు వసూలు చేసింది. దీంతో `ఇండియన్ -2` వసూళ్లను బీట్ చేయడానికి ఇంకా రెండు కోట్ల దూరంలోనే ఉంది. `ఇండియన్ -2` వరల్డ్ వైడ్ 151 కోట్ల వసూళ్లను సాధించిన సంగతి తెలిసిందే. చైనాలో పలు రికార్డులను బీట్ చేసేందుకు రానున్న వారంలో మహారాజకు మంచి ఛాన్స్ ఉన్నట్లు ట్రేడ్ అంచనా వేస్తుంది.
తాజావార్తలు
-
Kangana Ranaut: త్రిషపై ఉదయనిధి వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఏమన్నారంటే..!
-
Bihar Politics: బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ విజయం.. బీజేపీకి కాదు, అసలు తలనొప్పి ఆర్జేడీకే..
-
Pradeep Rawat : ఛత్రపతి, సై సినిమాల విలన్ మృతి?
-
Minister Narayana: సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు.. అమరావతికి కొత్త ఊపు
-
Udhayanidhi Stalin: ఉదయనిధి స్టాలిన్ విడుదల.. కార్యకర్తలు సంబరాలు
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!