Mahakaleshwar Temple dispute: గర్భగుడిలో గొడవ పడ్డ పూజారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahakaleshwar Temple dispute: ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయంలో బుధవారం ఒక అసహ్యకరమైన సంఘటన చోటుచేసుకుంది. ఆలయ గర్భగుడిలో పూజారి మహేష్ శర్మ, నాథ్ శాఖకు చెందిన మహంత్ మహావీర్నాథ్ మధ్య వివాదం చెలరేగింది. దుస్తుల కోడ్, తలపాగాలను తొలగించడంపై ఈ ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. వాగ్వాదం తీవ్రమై ఇద్దరు ఒకరిపై ఒకరు అసభ్యకరమైన పదజాలాన్ని ఉపయోగించే స్థాయి వరకు వెళ్లింది.
READ ALSO: Shilpa Shetty : రోజుకు రూ.2 కోట్లు సంపాదిస్తున్న హీరోయిన్..
Also Read
- Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్‌పై 1-0తో విజయం.!
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
పలు నివేదికల ప్రకారం.. రిణుముక్తేశ్వర్ ఆలయానికి చెందిన మహంత్ మహావీర్నాథ్, గోరఖ్పూర్ నుంచి మహంత్ శంకర్నాథ్ మహారాజ్‌తో కలిసి బుధవారం ఉదయం 8:15 గంటలకు మహాకల్ ఆలయానికి పూజల కోసం వచ్చారు. ఈ సందర్భంగా వారు గర్భగుడిలోకి ప్రవేశించిన తర్వాత, ఆలయ పూజారి మహేష్ శర్మ, మహంత్ మహావీర్నాథ్‌కు ఆలయ దుస్తుల నియమావళిని పాటించాలని, అలాగే వారి తలపాగాను తీసివేయమని కోరారు. కానీ ఇదే వారిద్దరి మధ్య వాగ్వాదానికి దారితీసింది.
ఈ సందర్భంగా మహంత్ మహావీర్నాథ్ మాట్లాడుతూ.. ఆలయ పూజారి మహేశ్ శర్మ భక్తులందరినీ వేధిస్తాడని ఆరోపించారు. తనతో పాటు ఉన్న మహంత్ గుండె రోగి అని, అయినప్పటికీ పూజారి తన తలపాగా, దుస్తులు తొలగించాలని బలవంతం చేశారని వివరించారు. మహేశ్ శర్మను ఆలయం నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్‌కు ఒక మెమోరాండం సమర్పిస్తానని మహంత్ చెప్పారు. ఇదే సమయంలో పూజారి మహేశ్ శర్మ మాట్లాడుతూ.. ఆలయంలోకి ప్రవేశించడానికి ఒక నిర్దిష్ట దుస్తుల కోడ్ ఉందని, దానిని అందరూ పాటించాలని అన్నారు.
కీలకంగా సీసీటీవీ ఫుటేజ్ ..
ఈ సంఘటనను ఆలయ నిర్వహణ కమిటీ తీవ్రంగా పరిగణించింది. ఆలయ నిర్వాహకుడు ప్రథమ్ కౌశిక్ మాట్లాడుతూ.. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు జరుగుతోందని, ఎవరైనా దోషులుగా తేలితే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
READ ALSO: Kafala abolished 2025: సౌదీలో కఫాలా వ్యవస్థ రద్దు.. బానిసత్వం నుంచి బయటపడ్డ భారతీయ కార్మికులు..
తాజావార్తలు
-
Honda UC3 Electric Scooter: 122KM రేంజ్, 3.2kWh బ్యాటరీతో హోండా UC3 ఎలక్ట్రిక్ స్కూటర్.. భారత్‌లో రిలీజ్ కు రెడీ..!
-
Hatha: పిల్లి చుట్టూ తిరిగే మిస్టరీ!.. ఇంటెన్స్ గా కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్
-
Veligonda Project Phase 1: వెలిగొండ ఫేజ్-1 ప్రారంభం.. 10.70 టీఎంసీల కృష్ణా జలాలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
-
Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
-
NBK111 : బాలయ్య – గోపీచంద్ మలినేని సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ డేట్ ఫిక్స్
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!